ప్రజల దృష్టి మళ్లించేందుకే కాంగ్రెస్ రాజకీయాలు.. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పల్లె రవికుమార్ గౌడ్

by Geesa Chandu |

అన్ని విషయాల్లో గత కేసీఆర్ ప్రభుత్వం మీద నిందలు మోపడం తప్ప, పాలనపై దృష్టిసారించడం లేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పల్లె రవికుమార్ గౌడ్ ఆరోపించారు.

ప్రజల దృష్టి మళ్లించేందుకే కాంగ్రెస్ రాజకీయాలు.. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పల్లె రవికుమార్ గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: అన్ని విషయాల్లో గత కేసీఆర్ ప్రభుత్వం మీద నిందలు మోపడం తప్ప, పాలనపై దృష్టిసారించడం లేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పల్లె రవికుమార్ గౌడ్ ఆరోపించారు. అధికారంలోకి వచ్చి 9 నెలలు అయిందన్న సోయి కాంగ్రెస్ సర్కారుకు లేదని మండిపడ్డారు. మంగళవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. ఖమ్మంలో బీఆర్ఎస్ నాయకులపై దాడి కాంగ్రెస్ నేతల అసహన, దౌర్జన్య రాజకీయాలను తెలియజేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రజా పాలన కాదు, రాక్షస పాలన అని దుయ్యబట్టారు. నిరాశ్రయులైన ప్రజలకు తక్షణ సాయం చేయలేక ప్రభుత్వం, ప్రజలకు సమాధానం చెప్పలేని ప్రభుత్వం ప్రతిపక్షం మీద దాడులకు పాల్పడుతుందన్నారు. రేవంత్ రెడ్డికి పరిపాలన చేతకాక ప్రతి విషయంలో దృష్టి మళ్లించే రాజకీయాలు చేస్తున్నాడని అన్నారు. కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యాలకు, అరాచకాలకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా సర్కారు స్పందించి వరద బాధితులకు సహాయం అందించాలని కోరారు.

బీఆర్ఎస్ నేతలపై దాడి సిగ్గుచేటు..

బాలరాజు యాదవ్

బీఆర్ఎస్ నేతలపై భౌతిక దాడులకు పాల్పడి రాజకీయాలను దిగజార్చడం మంచిది కాదని, పార్టీ అధికార ప్రతినిది దూదిమెట్ల బాలరాజు యాదవ్ అన్నారు. మంగళవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలపై దాడిని ఖండించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల చర్య సిగ్గుచేటు అన్నారు. పరామర్శకు పోయిన ప్రతిపక్ష నాయకుల సలహలు సూచనలు స్వీకరించకుండా.. కొంత మందిని రెచ్చగొట్టి కార్లపైన అక్కడకు వచ్చిన వారిపై దాడులకు పాల్పడం అన్యాయమన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు భరోసా ఇవ్వడం మానేసి భయభ్రాంతులకు గురిచేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రజలు ఛీ కొట్టేలా చేసుకుంటున్నారు తప్ప ఇలాంటి దాడులు చేసినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ భయపడదని తెలిపారు.

Next Story