బంగాళాఖాతంలో కాంగ్రెస్ పార్టీ జనగనణ.. ఎంపీ ఈటల హాట్ కామెంట్స్

by Ramesh Goud |

కాంగ్రెస్ చేసిన బీసీ జనగణనకు శాస్త్రీయత లేదని మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (BJP MP Eatala Rajendar) సంచలన వ్యాఖ్యలు చేశారు.

బంగాళాఖాతంలో కాంగ్రెస్ పార్టీ జనగనణ.. ఎంపీ ఈటల హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ చేసిన బీసీ జనగణనకు శాస్త్రీయత లేదని మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (BJP MP Eatala Rajendar) సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా జనాభా గణన (Census), కులగణన (Caste Census)పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై మీడియా సమావేశంలో మాట్లాడిన ఈటల.. కాంగ్రెస్ పార్టీ (Congress Party)పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన కులగణన కార్యక్రమంపై విమర్శలు చేశారు.

ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణనలో శాస్త్రీయత లేదని, బీసీ జనాభా (BC Population) తగ్గించి చూపించారని ఆరోపించారు. అలాగే బీసీ సంఘాలు కాంగ్రెస్ పార్టీ చేసిన జనగణన బంగాళాఖాతంలో వేసాయని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు జనగణన చేయలేదు కానీ ఇప్పుడు చేయాలని డిమాండ్ చేయడం సిగ్గుచేటు అని కాంగ్రెస్ పై ఘాటు విమర్శలు చేశారు. అంతేగాక ఒడ్డు ఎక్కేదాక ఓడ మల్లన్న, ఎక్కాక బోడమల్లన్న అనేది కాంగ్రెస్ కి అలవాటు అని మండిపడ్డారు. ఇక ప్రధాని మోదీ (PM Narendra Modi) మాట ఇస్తే దేశమంతా నమ్ముతుందని, కేంద్రం చేసే కులగణన బీసీలలో రాజకీయ సామాజిక ఆర్ధిక విద్యా పరంగా వరంగా మారుతుందని తెలిపారు. నిజమైన సామాజిక న్యాయం అందిస్తున్న పార్టీ ఒక్క బీజేపీ మాత్రమేనని ఎంపీ ఈటల స్పష్టం చేశారు.

Next Story