Etala Rajender : కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు : ఈటల

by Y. Venkata Narasimha Reddy |

రాష్ట్రంలో అధికార కాంగ్రెస్(Congress) పార్టీ పాలనా వైఫల్యాలతో ఆ పార్టీకి భవిష్యత్తు లేకుండా పోయిందని బీజేపీ(Bjp) ఎంపీ ఈటల రాజేందర్(Etala Rajender) అన్నారు. హుజురాబాద్ పట్టణంలోని మధువని గార్డెన్స్ లో నిర్వహించిన గ్రాడ్యుయేట్స్ సమావేశంలో పాల్గొని ప్రసంగించడం జరిగింది.

Etala Rajender : కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు : ఈటల
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో అధికార కాంగ్రెస్(Congress) పార్టీ పాలనా వైఫల్యాలతో ఆ పార్టీకి భవిష్యత్తు లేకుండా పోయిందని బీజేపీ(Bjp) ఎంపీ ఈటల రాజేందర్(Etala Rajender) అన్నారు. హుజురాబాద్ పట్టణంలోని మధువని గార్డెన్స్ లో నిర్వహించిన గ్రాడ్యుయేట్స్ సమావేశంలో పాల్గొని ప్రసంగించడం జరిగింది. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల పాలన చూశారని...ఆ రెండు పార్టీలపై నమ్మకం పోయిందని..ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలు డిసైడ్ అయ్యారని ఈటల పేర్కొన్నారు.

బీఆర్ఎస్ పాలన పిదప కాంగ్రెస్ పాలనతో తమ పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు అయ్యిందని ప్రజలు బాధపడుతున్నారన్నారు. కాంగ్రెస్ పాలన మీద మాట్లాడుతున్న పార్టీ బీజేపీ ఒక్కటేనని..ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడగడానికి.. రేవంత్ రెడ్డికి దమ్ము లేదని..కాంగ్రెస్ పార్టీకి ముఖం లేదని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలుగా పనిచేస్తున్నప్పుడు ప్రజాజీవితంలో అనేక బాధలుంటాయని.. అన్నింటిని దిగమింగుకొని అధిగమించిన వాడే ధీరుడన్నారు. సమస్య వస్తే పారిపోయేవాడు లీడర్ కాదని.. రాజకీయాలు పూలబాట కాదు ముళ్లబాట అని ఈటల వ్యాఖ్యానించారు.

నేను 365 రోజులు 24 గంటలు పనిచేసే వాడినని... నాకు సెలవలు లేవని.. జ్వరం వచ్చిందని పడుకున్న సందర్భాలు లేవని ఈటల గుర్తు చేసుకున్నారు. మీరంతా కూడా ప్రజాజీవితంలో సేవాభావంతో చిత్తశుద్ధిగా పనిచేయాలన్నారు.

Next Story