Bandi Sanjay : కాంగ్రెస్ ఏడాది పాలన ప్రత్యక్ష నరకమే : బండి సంజయ్

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-01-02 15:27:23  IST  )

తెలంగాణలో ఏడాది కాంగ్రెస్ పాలన(Congress Rule)పై కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) ట్విటర్ వేదికగా మరోసారి ఫైర్ అయ్యారు.

Bandi Sanjay : కాంగ్రెస్ ఏడాది పాలన ప్రత్యక్ష నరకమే : బండి సంజయ్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో ఏడాది కాంగ్రెస్ పాలన(Congress Rule)పై కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) ట్విటర్ వేదికగా మరోసారి ఫైర్ అయ్యారు. ఏం చూసింది ఏడాది కాలంలో తెలంగాణ? 12 నెలల ప్రత్యక్ష నరకం(Living Hell)తప్ప అంటూ విమర్శలు గుప్పించారు. రైతుల రోదనలు ఆటోవాలాల ఆత్మహత్యలు.. ఆడబిడ్డల ఆక్రందనలు.. నిరుద్యోగుల నిరాశ, నిస్పృహలు.. పసి పిల్లల అన్నంలో పురుగులు కాంగ్రెస్ పాలన వైఫల్యాలు అంటూ బండి సంజయ్ మండిపడ్డారు.

హైడ్రాతో అరాచకాలు మూసీతో మూటలు నింపే ప్రణాళికలు కాంట్రాక్టర్ల దోపిడీ కథలు నీటిమూటలైన మాటలు అంటూ విమర్శించారు. ఆయా సమస్యలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను పోస్టు చేశారు.

Next Story