MP: కేసీఆర్ కాదు.. తెలంగాణ రియల్ హీరో రేవంత్ రెడ్డే

by Gantepaka Srikanth |   (  Updated:2025-02-18 09:27:55  IST  )

‘నా తండ్రి నాకే కాదు.. మొత్తం తెలంగాణకే హీరో’ అని నిన్న కేసీఆర్(KCR) పుట్టినరోజు సందర్భంగా కేటీఆర్(KTR) వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

MP: కేసీఆర్ కాదు.. తెలంగాణ రియల్ హీరో రేవంత్ రెడ్డే
X

దిశ, వెబ్‌డెస్క్: ‘నా తండ్రి నాకే కాదు.. మొత్తం తెలంగాణకే హీరో’ అని నిన్న కేసీఆర్(KCR) పుట్టినరోజు సందర్భంగా కేటీఆర్(KTR) వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి(MP Mallu Ravi) కౌంటర్ ఇచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ తెలంగాణ హీరో అని బీఆఎస్ నేతలు మాట్లాడుతున్నారు.. కానీ తెలంగాణలో నిజమైన హీరో సీఎం రేవంత్ రెడ్డే(CM Revanth Reddy) అని అన్నారు. కేసీఆర్ తన పదేళ్ల పాలనా కాలంలో చేయలేని అనేక అభివృద్ధి, సంక్షేమ పనులను రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఏడాది కాలంలో చేసి చూపించారని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కుల ఘనన చేసి కులాల లెక్కలు తేల్చిన ఘనత రేవంత్ రెడ్డిదే అని తెలిపారు. రాష్ట్రంలో 56 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను మంజూరు చేసి పనులు ప్రారంభించిన ఘనత కూడా రేవంత్ రెడ్డి‌దే అన్నారు.


25 ఎకరాల స్థలంలో రూ.200 కోట్లతో ఒక్కొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సహాయ పడేలా ఒక్కో లబ్ధిదారుడికి రూ.5 లక్షలు ఇస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, రూ.500 లకే గ్యాస్ సిలిండర్, నిరుద్యోగులకు 55 వేల ఉద్యోగాలు, ఆరోగ్య శ్రీ కింద 10 లక్షలు, ప్రజా భవన్ పెట్టి ప్రజావాణీ కింద ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఫోర్త్ సిటీ ఏర్పాటు చేయబోతున్నారు. ఇవన్నీ ఏడాది కాలంలోనే రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేసి చూపించారని అన్నారు. అందుకే తెలంగాణ రియల్ హీరో రేవంత్ రెడ్డి అంటున్నానని చెప్పారు.

Next Story