కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి క్షమాపణ చెప్పాలి : కేటీఆర్

by Ratna Kumari |   (  Updated:2026-01-21 10:02:47  IST  )

అలంపూర్ ఎమ్మెల్యే బీఆర్‌ఎస్ నాయకుడు విజయుడిపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి దుర్భాషలాడుతూ చేయి చేసుకోవడం ప్రజాస్వామ్యంపై జరిగిన బహిరంగ దాడిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు.

కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి క్షమాపణ చెప్పాలి : కేటీఆర్
X

దిశ‌, జోగులాంబ ప్ర‌తినిధి: అలంపూర్ ఎమ్మెల్యే బీఆర్‌ఎస్ నాయకుడు విజయుడిపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి దుర్భాషలాడుతూ చేయి చేసుకోవడం ప్రజాస్వామ్యంపై జరిగిన బహిరంగ దాడిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. ప్రతిపక్షాన్ని భయపెట్టేందుకు, గొంతు నొక్కేందుకు కాంగ్రెస్ నేతలు దిగజారిన రాజకీయానికి ఇది నిదర్శనమని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. ప్రజలతో ఎన్నికైన ఎమ్మెల్యేను అవమానిస్తూ, శారీరక దాడికి దిగడం కాంగ్రెస్ సంస్కృతి ఎంత దిగజారిందో అర్థమవుతుందని కేటీఆర్ మండిపడ్డారు. చట్టం, రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలపై కాంగ్రెస్‌కు గౌరవం లేదని ఈ ఘటన మరోమారు స్పష్టం చేస్తోందన్నారు. ఈ దాడిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. ఎంపీ మల్లు రవి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహించి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిపక్షాన్ని బెదిరింపులతో కాదు, ప్రజల తీర్పుతోనే ఎదుర్కోవాలని సూచించారు. బీఆర్‌ఎస్ నాయకులపై దాడులు చేస్తే చూస్తూ ఉరుకోమని హెచ్చరించారు.

Read More..

Phone Tapping Case: హరీశ్ రావు బాధితుడా? నిందితుడా? ఫోన్ ట్యాపింగ్ కేసులో అనూహ్య పరిణామం

Next Story