బీసీ బిడ్డమీద నీ అగ్రవర్గ అహంకారం చూపిస్తావా?.. కేటీఆర్‌పై మల్లు రవి ఫైర్

by Gantepaka Srikanth |

బీసీ బిడ్డను రౌడీ షీటర్ అని అవమానిస్తావా..? ఇది బీసీల ఆత్మగౌరవంపైన దాడి అని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి మండిపడ్డారు.

బీసీ బిడ్డమీద నీ అగ్రవర్గ అహంకారం చూపిస్తావా?.. కేటీఆర్‌పై మల్లు రవి ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీసీ బిడ్డను రౌడీ షీటర్ అని అవమానిస్తావా..? ఇది బీసీల ఆత్మగౌరవంపైన దాడి అని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి మండిపడ్డారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మంచి విద్యావంతులు, పేదలకు సహాయం చేసే గుణం ఉన్న వ్యక్తి అని, ఆయనపై నీ అగ్రవర్ణ అహంకారాన్ని చూపిస్తావా మల్లు రవి విమర్శించారు. గురువారం మల్లు రవి ప్రకటన విడుదల చేశారు. నవీన్ యాదవ్ పైన కేసీఆర్ మాటలు సమస్త బీసీలను అవమానపరిచినట్లే అని, ఇది బీసీ సమాజం గుర్తించాలన్నారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ బీసీని నిలబడితే ఆయన గెలుస్తారనే టాక్ రావడంతో కేసీఆర్​బెంబేలెత్తుతున్నారని మల్లు రవి అన్నారు. కాంగ్రెస్ సామాజిక న్యాయం కోసం ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇస్తే మీరు అగ్రవర్ణాలకు టికెట్ ఇచ్చి బీసీలపై విషం కక్కుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ ఆపలేరని మల్లు రవి స్పష్టం చేశారు.

Next Story