- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mallu Ravi: బీసీ బంధు రేవంత్ రెడ్డి.. దళిత, బహుజన వర్గాలు కాంగ్రెస్ వైపే.. కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి
by Ramesh Naini |
కేంద్రం ఎన్ని అడ్డంకులు సృష్టించిన బీసీలకు 42 శాతం రాజకీయ రిజర్వేషన్లు అమలు చేసి నిజమైన బీసీ బంధువుగా గుర్తింపు తెచ్చుకున్నారని కాంగ్రెస్ఎంపీ మల్లు రవి అన్నారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆలోచనలు అమలు చేస్తున్న నాయకులు రేవంత్ రెడ్డి అని, కేంద్రం ఎన్ని అడ్డంకులు సృష్టించిన బీసీలకు 42 శాతం రాజకీయ రిజర్వేషన్లు అమలు చేసి నిజమైన బీసీ బంధువుగా గుర్తింపు తెచ్చుకున్నారని కాంగ్రెస్ఎంపీ మల్లు రవి (Mallu Ravi) అన్నారు. ఈ అంశంలో దేశానికి తెలంగాణ రోల్ మోడల్ గా నిలిచిందని శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన అన్నారు. దేశంలోని మొట్ట మొదటిసారిగా సమగ్ర కుల గణన చేసి శాస్త్రీయ పద్ధతిలో విధానాన్ని రూపొందించి అన్ని రకాలుగా బిసి రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డిదే అన్నారు. బీసీ రిజర్వేషన్లు కోసం చిత్తశుద్ధిగా చర్యలు తీసుకున్నారని, దళిత, బహుజన వర్గాలు అంత కాంగ్రెస్ వైపే ఉండాలని మల్లు రవి విజ్ఞప్తి చేశారు.
Next Story






