- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Congress MP: అహంకారమే బీఆర్ఎస్ కొంప ముంచింది
ప్రజలకు ఏం కావాలో బీఆర్ఎస్ గుర్తించలేకపోయిందని, ఆ పార్టీ కార్పొరేట్లకు, కమీషన్లకు ప్రయారిటీ ఇచ్చిందని ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజలకు ఏం కావాలో బీఆర్ఎస్ గుర్తించలేకపోయిందని, ఆ పార్టీ కార్పొరేట్లకు, కమీషన్లకు ప్రయారిటీ ఇచ్చిందని ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. సోమవారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అహంకారమే కొంప ముంచిందన్నారు. తెలంగాణ ప్రజలపై అహంకారం ప్రదర్శిస్తే తిరుగుబాటు మొదలవుతుందని వివరించారు. ఇప్పటికీ ఆ పార్టీ నేతల్లో మార్పు మొదలు కాలేదన్నారు. ఇక తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలో ప్రతిపక్షాలు రాజకీయం చేయాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు. ప్రపంచంలో అతిపెద్ద గిరిజన జాతర, తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం సమ్మక్క-సారలమ్మ జాతరను కూడా బీఆర్ఎస్ చిన్నచూపు చూసిందన్నారు. ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతోనే బీఆర్ఎస్ జీర్జించుకోలేకపోతున్నారన్నారు. సురక్షిత తెలంగాణకు నిర్మించడమే తమ టార్గెట్ అంటూ పేర్కొన్నారు.






