- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేంద్రమంత్రి రాజీనామాతో ఈ సమస్యకు పరిష్కారం కాదు
కేంద్ర విద్యా శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశంపై ఎంపీ చామల కిరణ్ రెడ్డి రియాక్ట్ అయ్యారు.

దిశ, తెలంగాణ బ్యూరో : జంతర్ మంతర్‌తో పాటు దేశవ్యాప్తంగా విద్యార్థుల పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని నిలదీయడంతో అహంకారపూరితంగా వ్యవహరిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి దిమ్మతిరిగేలా చేసిందని ప్రభుత్వ విప్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం సీఎల్పీలోని మీడియా సెంటర్ నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చీమలే కదా నలిపేద్దాం అని విద్యార్థుల మీద లాఠీచార్జ్, బాష్పవాయు ప్రయోగం చేస్తూ విర్రవీగిన ప్రభుత్వం వారి డిమాండ్లకు తలవంచాల్సి వచ్చిందన్నారు. చీమలే దండుగా మారి మోడీ అహంకారానికి చావుదెబ్బ కొట్టాయని, దేశంలో ప్రస్తుతం ఒక విధంగా అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని యెన్నం శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. దేశంలోని విద్యార్థి శక్తి, యువత నరేంద్ర మోడీకి గుణపాఠం చెప్పాలని పోరాటం చేయడంతో కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదన్నారు. నరేంద్ర మోడీ గత ఎన్నికల్లో భావోద్వేగాలకు గురిచేసి, రామ మందిరం పేరు మీద ఓట్లు అడిగి గెలిచారు తప్ప ప్రజల అసలు సమస్యలను పరిష్కరించడంలో చొరవ చూపలేదని యెన్నం శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. 24 గంటలు విదేశాల్లో తిరగడమే గొప్ప అని దేశ ప్రజలను భ్రమింపజేస్తున్నారని, కేవలం సోషల్ మీడియా ద్వారానే ఈ దేశాన్ని పరిపాలించాలని వారు అనుకుంటున్నారని ఆయన విమర్శించారు. గడిచిన 13 సంవత్సరాల కాలంలో ప్రజలకు ఉపయోగపడే ఏ ఒక్క గొప్ప ప్రాజెక్టును కూడా చేపట్టలేదని, ప్రతిపక్షాల గొంతు నొక్కడం, ఇన్‌కమ్ ట్యాక్స్, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకోవడమే వీరు విజయంగా భావిస్తున్నారని యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. పరిశ్రమలన్నీ గుజరాత్‌కే తరలిస్తున్నారని, వీరి విదేశాంగ విధానం పూర్తిగా విఫలమైందని, మణిపూర్ వంటి అంతర్గత లా అండ్ ఆర్డర్ సమస్యలను కూడా పరిష్కరించలేకపోయారని ఆయన మండిపడ్డారు.
కేంద్రమంత్రి రాజీనామాతో ఈ సమస్యకు పరిష్కారం కాదు .. దీనిపై పార్లమెంట్ లో చర్చ జరగాలి
కేంద్ర విద్యా శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశంపై ఎంపీ చామల కిరణ్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రజాస్వామ్య విజయమని, గత పార్లమెంట్ సమావేశాలోనే నీట్ పేపర్ లీకేజీపై చర్చ జరగాలని ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారన్నారు. కేంద్రమంత్రి రాజీనామాతో ఈ సమస్యకు పరిష్కారం కాదని, దీనిపై పార్లమెంట్ లో చర్చ జరగాలని ఆయన స్పష్టం చేశారు. తప్పు జరగనట్లుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిందని, లక్షలాది మంది విద్యార్థులు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేశారని ఎంపీ చామల తెలిపారు. లోక్ సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి ఇంటి ముందు ధర్నా చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థులు, ప్రతిపక్షాలతో పాటు ప్రజల డిమాండ్లను పట్టించుకోలేదని, భవిష్యత్తులో పేపర్ లీకేజీ ఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎంపీ చామల డిమాండ్ చేశారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలని, కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ తొలిసారి దిగి వచ్చారు, విద్యార్థులు, ప్రతిపక్షాలు, రాహుల్ గాంధీ పోరాటంతోనే ఈ విజయం సాధ్యం అయిందని చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. కేంద్రం ప్రతిపక్ష పార్టీలకు, ప్రజల డిమాండ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.






