- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాళేశ్వరం ఇష్యూ..కేంద్రం వెంటనే సీబీఐ విచారణ జరిపించాలి
కాళేశ్వరం కమీషన్ రిపోర్టును హై కోర్టు తప్పుపట్టలేదని, బీఆర్ఎస్ నేతలు ఎందుకు సంబురాలు చేసుకుంటున్నారని చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : కాళేశ్వరం కమీషన్ రిపోర్టును హై కోర్టు తప్పుపట్టలేదని, బీఆర్ఎస్ నేతలు ఎందుకు సంబురాలు చేసుకుంటున్నారని భువనగిరి ఎంపీ, చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. బుధవారం ఆయన గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ సంబురాలు చేసుకునే విధంగా కోర్టు తీర్పులో ఏముందని, మేడిగడ్డ పిల్లర్లు కుంగిన తర్వాత అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ఉందని కమీషన్ రిపోర్టులో ఉందన్నారు. ఎన్డీఎస్ఏ సైతం ఇదే అంశాన్ని చెప్పిందని, ఘోష్ కమీషన్ రిపోర్ట్ ఆధారంగా సీబీఐ విచారణ చేయాలని ప్రభుత్వం అడగలేదని, ఎన్డీఎస్ఏ చెప్పింది తప్పా, కరెక్టా అనే అంశం బీజేపీ చెప్పాలని చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీజేపీకి బాధ్యత పెరిగిందని, కేంద్ర ప్రభుత్వం వెంటనే సీబీఐ విచారణ చేపించాలని ఆయన డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దిగజారిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మాకు క్లిన్ చిట్ ఇవ్వాలని హరీష్ రావు ఢిల్లీలో ఏమైనా మంతనాలు చేశారా? కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని పలు సంస్థలు చెప్పాయని ఎంపీ చామల తెలిపారు.
ఘోష్ కమిషన్ రాజ్యాంగబద్ధమే అని కోర్టు చెప్పింది : ప్రభుత్వ విప్, అద్దంకి దయాకర్
కోర్టు తీర్పు మాకేదో లాభం చేయకూరిందని బీఆర్ఎస్ భావిస్తుందని, ఘోష్ కమిషన్ రాజ్యాంగబద్ధమే అని కోర్టు చెప్పిందని శాసన మండలిలో ప్రభుత్వ విప్, అద్దంకి దయాకర్ అన్నారు. బుధవారం అయన మీడియాతో మాట్లాడుతూ తాత్కాలికంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మాత్రమే చెప్పిందని, సీబీఐ నివేదిక వస్తుంది..ఘోష్ కమిషన్ తో కంపేర్ చేసిన తర్వాత అసలు నిజం తెలుస్తుందన్నారు. తాత్కాలిక రిపోర్ట్ ని చూసి ఫైనల్ రిపోర్ట్ అని భావిస్తున్నట్టున్నారని, త్వరలోనే మీ భాగోతం బయటపడుతుందని అద్దంకి దయాకర్ అన్నారు. హరీష్ రావు ఢిల్లీలో ప్రదక్షిణ చేస్తున్నారని అర్థమవుతుందని, బీజేపీతో కలిస్తే తమ తప్పులు మాఫీ అయిపోతాయని భావిస్తున్నట్టున్నారు..తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోలేరన్నారు.
కాళేశ్వరంలో జరిగిన అవినీతి వాస్తవం : ప్రభుత్వ విప్, బల్మూర్ వెంకట్
కాళేశ్వరం విషయంలో హై కోర్టు ఎవరికీ క్లీన్ చీట్ ఇవ్వలేదని, ఘోష్ కమిషన్ కు సంబంధించిన టెక్నికల్ అంశాలపై మాత్రమే కోర్టు మాట్లాడిందని శాసన మండలిలో ప్రభుత్వ విప్, బల్మూర్ వెంకట్ అన్నారు. కాళేశ్వరం విషయంలో ప్రభుత్వం అన్ని నిబంధల ప్రకారమే చర్యలు చేపట్టిందని, కమిషన్ ఏర్పాటు చేసి, దర్యాప్తు చేసిందని ఆయన చెప్పారు. బుధవారం బల్మూర్ వెంకట్ మీడియాతో మాట్లాడుతూ పారదర్శకంగా ఉండాలని, సీబీఐకి అప్పగించిందని, కాళేశ్వరం విషయంలో తప్పు జరిగిందని, కేంద్ర దర్యాప్తు సంస్థలు, కూడా ధృవీకరించాయన్నారు. ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలను బీఆర్ఎస్ నేతలు కలిసి, తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని, కాళేశ్వరంలో జరిగిన అవినీతి వాస్తవం, ఆలస్యమైనా, దర్యాప్తు నివేదిక తర్వాత బాధ్యులకు శిక్ష పడాల్సిందే, ఎవరూ తప్పించుకోలేరని బల్మూర్ వెంకట్ అన్నారు. హై కోర్టు తీర్పుకు సీబీఐ విచారణకు ఎలాంటి ఆటంకం లేదన్నారు.






