ధన్‌ఖడ్ రాజీనామా ఆశ్చర్యం కలిగిస్తోంది: అధికార పార్టీ MP

by Gantepaka Srikanth |

భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్(Jagdeep Dhankhar) రాజీనామా ఆశ్చర్యం కలిగిస్తోందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy) అన్నారు.

ధన్‌ఖడ్ రాజీనామా ఆశ్చర్యం కలిగిస్తోంది: అధికార పార్టీ MP
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్(Jagdeep Dhankhar) రాజీనామా ఆశ్చర్యం కలిగిస్తోందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy) అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిజంగా అనారోగ్యంతోనే రాజీనామా చేసి ఉంటే.. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా అని తెలిపారు. కానీ ఆయన రాజీనామా చూస్తుంటే అలా అనిపించడం లేదు. దాని వెనుక ఏదో ఉన్నట్లు అనుమానం కలుగుతోందని కీలక ఆరోపణలు చేశారు. కాగా, పార్లమెంటు వర్షాకాల సమావేశాల వేళ అనూహ్యంగా ధన్‌ఖడ్ రాజీనామా చేయడం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. వైద్య పరమైన కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(Draupadi Murmu)కు పంపిన లేఖలో ఆయన పేర్కొన్నారు. 2022 ఆగస్టులో ధన్‌ఖడ్‌ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.

Next Story