- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
13 కోట్ల మంది పొట్ట కొట్టాలని కేంద్రం కుట్ర: MP
13 కోట్ల మంది పొట్ట కొట్టాలని కేంద్రం కుట్ర: MP

దిశ, వెబ్‌డెస్క్: రోహతక్ ఎంపీ దీపెందర్ హుడా(Deepender Hooda) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. మోడీ ప్రభుత్వం పేరు కోసం రాజకీయం చేస్తోందని విమర్శించారు. మహాత్మా గాంధీ పేరుతో ఉన్న మనరేగాను తీసివేయాలని చూస్తోందని ఆరోపించారు. దేశ వ్యాప్తంగా ఉన్న 13 కోట్ల మంది పేదల పొట్ట కొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. కొవిడ్ సమయంలో పనికి ఆహార పథకం సంజీవిని లాగా పని చేసిందని గుర్తుచేశారు. జీ రామ్ జీకి గ్యారెంటీ లేదని అన్నారు. బీజేపీ ప్రభుత్వం జీ.రామ్ జీ పేరుతో రాష్ట్రాలపై భారం మోపాలని చూస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీలకు ఇప్పుడు హక్కులు ఉండవు.. కేంద్రం ఆధీనంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. రాష్ట్రాలకు నిధులు ఇవ్వదు.. కానీ అధికారం కేంద్రం చేతుల్లోనే ఉంటదని అన్నారు. క్రమేణా పథకాన్ని తీసివేయాలని చూస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని అన్నారు. దేశం మహాత్మ గాంధీ అడుగుజాడల్లో నడుస్తుందని చెప్పారు. దేశంలో ఇందిరా గాంధీ తీసుకొచ్చిన పథకాలను మార్చి బీజేపీ పేరుతో నడిపిస్తుందని విమర్శించారు. గాంధీ కుటుంబం పేరుతో ఉన్న పథకాల పేర్లు అన్ని బీజేపీ ప్రభుత్వం మారుస్తుందని అన్నారు.
వందే వందే మాతరం గీతాన్ని మార్చి ఆర్ఎస్ఎస్ గీతాన్ని తీసుకురావాలని బీజేపీ చూస్తోంది. నేషనల్ హెరాల్డ్ పేరుతో సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను ఇబ్బందులకు గురిచేస్తోంది. కానీ కోర్టు ఎఫ్‌ఐఆర్ కూడ తీసుకోలేదని గుర్తుచేశారు. 2015లో డాక్టర్ సుబ్రహ్మణ్యం స్వామి ప్రయివేట్ ఫిర్యాదుతో ఈడీ, సీబీఐ కేసు నమోదు చేసింది. మనీ లాండరింగ్ జరిగిందని పదే పదే రెండు సంస్థలు కేసులో పెట్టి ఇబ్బంది పెట్టింది. కేవలం రాజకీయ కక్షతోనే నేషనల్ హెరాల్డ్ కేసు పెట్టి ఇబ్బంది పెట్టారని తెలిపారు. రాహుల్ గాంధీ పోరాటం చేశారు.. కోర్టు ఫైల్‌ను తిరస్కరించింది.. చివరకు సత్యమే గెలిచిందని అన్నారు.






