రెడ్ బుక్, పింక్ బుక్‌పై మాట్లాడాల్సిన అవసరం లేదు.. కేటీఆర్‌కు కాంగ్రెస్ ఎంపీ కౌంటర్

by Ramesh Naini |

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెపిడెంట్ కేటీఆర్‌కు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు.

రెడ్ బుక్, పింక్ బుక్‌పై మాట్లాడాల్సిన అవసరం లేదు.. కేటీఆర్‌కు కాంగ్రెస్ ఎంపీ కౌంటర్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెపిడెంట్ కేటీఆర్‌కు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. మంగళవారం ఎంపీ చామల మాట్లాడుతూ.. చట్టాల గురించి సీఎం రేవంత్ రెడ్డికి, డీజీపీ శివధర్ రెడ్డికి కేటీఆర్ చెప్పాల్సిన అవసరం లేదని మండిపడ్డారు. రెడ్ బుక్, పింక్ బుక్ , ఖాకీ బుక్ గురించి కేటీఆర్ మాట్లాడాల్సిన అవసరం లేదని, ఖాకీ బుక్ ఎప్పటికీ ఉంటుందని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో పోలీసులను ఏ విధంగా వాడుకున్నారో స్వంత మీ చెల్లి చెప్పారు.. ఇంటి అల్లుడి ఫోన్ ట్యాప్ చేశారని కవిత చెప్పారు.. అని విమర్శించారు. రెడ్ బుక్, పింక్ బుక్‌తో అధికారంలోకి వస్తామనే ఆలోచనలు కేటీఆర్ బంద్ చేయాలని సూచించారు.

కేటీఆర్ లాగా మేము చట్టాన్ని చుట్టంలాగా వాడుకోవడం లేదని అన్నారు. మీ పదేళ్ల పాలన చూసి ప్రజలు మిమ్మల్ని పర్మినెంట్ గా ఇంటికి పంపించారని విమర్శించారు. మీ లాగా పొలీసులను అధికార దుర్వినియోగం కోసం మేము వాడటం లేదన్నారు. రాజ్యాంగం పై మాకు పూర్తి నమ్మకం ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో చట్టం తన పని తాను చేస్తుందని వెల్లడించారు.

Next Story