కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కాంగ్రెస్ ఎంపీ చామల లేఖ

by Ajay Maddhiboyina |

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. సింగరేణిలో 2014 నుండి ఇప్పటి వరకు జరిగిన అన్ని టెండర్లపై సమగ్ర విచారణ జరిపించాలని అన్నారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కాంగ్రెస్ ఎంపీ చామల లేఖ
X

దిశ‌, వెబ్ డెస్క్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. సింగరేణిలో 2014 నుండి ఇప్పటి వరకు జరిగిన అన్ని టెండర్లపై సమగ్ర విచారణ జరిపించాలని అన్నారు. నైనీ కోల్ బ్లాక్ విషయంలో తలెత్తిన వివాదంపై తక్షణమే స్పందించి ఇద్దరు సభ్యులతో కూడిన బృందాన్ని విచారణకు వేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కేవలం నైనీ కోల్ బ్లాక్ టెండర్ రద్దు అంశానికే ఈ విచారణను పరిమితం చేయవద్దని కోరారు.

సింగరేణిలో గడిచిన పదేళ్ల కాలంలో జరిగిన అన్ని టెండర్లు, అధికారిక ప్రక్రియలపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. సింగరేణి లాంటి ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ రంగ సంస్థలో పారదర్శకత, ప్రజాహితాన్ని కాపాడటం అత్యంత అవసరం అని చామల అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే నైనీ కోల్ బ్లాక్ టెండర్లలో అవినీతి జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ టెండర్ ను ప్రభుత్వం రద్దు చేసింది. మరోవైపు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దీనిపై విచారణ జరిపేందుకు ఓ కమిటీని వేశారు. ఈ నెల 25లోపు కమిటీ నివేదికను సమర్పించాల్సి ఉంది.

Next Story