- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జూబ్లీహిల్స్ ఫలితాలపై కాంగ్రెస్ MP చామల కీలక వ్యాఖ్యలు
జూబ్లీహిల్స్ ఫలితాలపై కాంగ్రెస్ MP చామల కీలక వ్యాఖ్యలు

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills By Election) ఫలితాలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి అనే హోదాను మర్చిపోయి మాట్లాడటం బండి సంజయ్(Bandi Sanjay)కు అలవాటు అయిందని విమర్శించారు. హిందువులు అంతా ఏ పార్టీలో ఉన్నా బీజేపీలో చేరాల్సిన పరిస్థితి వచ్చింది అని బండి సంజయ్ మాట్లాడటం కరెక్ట్ కాదని హితవు పలికారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎంపీగా ఉన్న సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో జరిగితే బీజేపీ డిపాజిట్ గల్లంతు అయింది.. అసెంబ్లీ ఎన్నికల కంటే ఉపఎన్నికల్లో బీజేపీకి ఓట్లు తగ్గాయి.. బీజేపీ లోపాయికారిగా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చిందా? అని బండి సంజయ్‌ని చామల కిరణ్ ప్రశ్నించారు. దీనిపై ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత బండి సంజయ్‌పై ఉందని అన్నారు.
బండి సంజయ్ కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు.. అయినా ఆయన మాటలను తెలంగాణ ప్రజలు పట్టించుకోవడం లేదని అన్నారు. ఎవరికి ఓటు వేయాలో ప్రజలకు తెలుసని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో నవీన్ యాదవ్ ఒక కులం, ఒక మతం ఓట్లతో గెలవలేదు. అన్ని వర్గాల వారు ఓట్లు వేసి గెలిపించారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో బీసీ బిడ్డకు టిక్కెట్ ఇచ్చారు. ప్రజలు ఆదరించారని అన్నారు.
ఇకనైనా రాజకీయాలు మానేసి.. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం కేంద్రం వద్ద కిషన్ రెడ్డి, బండి సంజయ్ కృషి చేయాలని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అభివృద్ధి కోసం పదే పదే ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. గత పాలకులు దౌర్జన్యంగా దోచుకున్న తెలంగాణను కాపాడాలని కోరారు. మోడీ, అమిత్ షాపై కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి నిధులు తేవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ, ట్రిపులార్, మూసీ పునరుజ్జీవానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని అన్నారు. బండి సంజయ్ కులాలు, మతాల ప్రస్తావన పక్కన పెట్టి అభివృద్ధి గురించి మాట్లాడాలని హితవు పలికారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి కిషన్ రెడ్డి, బండి సంజయ్ చొరవ చూపాలని కోరారు.






