రిజర్వేషన్ విషయంలో కవిత ఏదో మాట్లాడుతుంది : ఎంపీ చామల కిరణ్

by Naga Rani Yarlagadda |

ఓబీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించే విషయంలో కవిత ఏదో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందని..

రిజర్వేషన్ విషయంలో కవిత ఏదో మాట్లాడుతుంది : ఎంపీ చామల కిరణ్
X
  • రాష్ట్ర ప్రజలను తప్పుతోవ పట్టిస్తుంది.
  • కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

దిశ, తెలంగాణ బ్యూరో: ఓబీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించే విషయంలో కవిత ఏదో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందని కాంగ్రెస్ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆమె బీజేపీ గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీనే తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నట్టుగా ప్రచారం చేస్తుందన్నారు. బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు బీసీలకు కల్పించే 42 శాతం రిజర్వేషన్లో ముస్లిం మైనార్టీలను పెట్టొద్దని అన్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి క్లియర్ కట్ గా సమాధానమిచ్చారన్నారు.

ఓబీసీ కమ్యూనిటీ అనేది కుల ప్రాతినిధ్యంగా, మత పరంగా తీసుకోరని అన్నారు. బ్యాక్వర్డ్ కమ్యూనిటీని ఐడెంటిఫై చేసి 42 శాతం క్రోడీకరించారని, ప్రధాన మంత్రి గతంలో ముఖ్యమంత్రిగా ప్రతినిధ్యం వహించిన గుజరాత్ లో కూడా ఓబీసీల జాబితాలో ముస్లిమ్స్ ఉన్నారని స్పష్టం చేశారు. యూపీ, మహారాష్ట్రలో కూడా ముస్లింలకు రిజర్వేషన్ కల్పించారని దుయ్యబట్టారు. ఈ మూడు రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్ తీసేసే ధైర్యం ఉంటే మీరు మాట్లాడండి అని సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావుకు తేటతలం చేశారన్నారు. 42 శాతం బీసీల్లో వెనుకబడ్డ ముస్లింలు ఉన్నారని ఢిల్లీలో హైదరాబాద్లో అర్థమయ్యే విధంగా సీఎం చెప్పారని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ కోసం కవిత 72 గంటల దీక్ష చేయాల్సిన అవసరం ఏమోచ్చిందని ప్రశ్నించారు.

ఆల్రెడీ అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది. క్యాబినెట్లో కూడా పాస్ అయింది. గవర్నర్ దగ్గరికి ఆర్డినెన్స్ పంపించారు. గవర్నర్ రాష్ట్రపతి దగ్గరికి దాన్ని పంపించారు, సీఎం, మంత్రులు ఎమ్మెల్యేలు మంగళవారం ఢిల్లీకి వస్తున్నారని వివరించారు. ఇండియా కూటమి ఎంపీలను అందరిని జంతర్ మంతర్ లో ధర్నాకు ఆహ్వానిస్తున్నారు. ఏడవ తేదీన రాష్ట్రపతి అపార్ట్మెంట్ తీసుకుంటున్నాం. మాకు చిత్తశుద్ధి ఉంది చేయాలని పట్టుదల ఉందని అన్నారు. కవిత 72 గంటలు చేసే దీక్ష వేరే మంచి విషయాల మీద దృష్టి పెట్టాలని సూచించారు. ఫిబ్రవరి 4 నుంచి 25 వరకు దీని మీదనే పనిచేసాము. లెక్కలు తీసి పోరాటం చేసే సమయంలో కవిత ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

Next Story