- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Group-1: గ్రూప్-1 వివాదం.. కేటీఆర్ పై కాంగ్రెస్ ఫిర్యాదు
24 గంటల్లో కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పై ఓయూ పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. గ్రూప్-1 పరీక్షపై ప్రభుత్వ ప్రతిష్టకు భంగంగలించే అసత్య ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ పై టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ (Chanagani Dayakar) ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University police station) పోలీసులకు ఇవాళ ఫిర్యాదు చేశారు. గ్రూప్ -1 విషయంలో వస్తున్న ఆరోపణలను ఖండించిన దయాకర్.. బీఆర్ఎస్ అధికారిక ఎక్స్ ఖాతా లో రూ. 3 కోట్లు కొట్టు గ్రూప్-1 పోస్టు పట్టు! అని పోస్టు చేశారని ఈ విషయంలో కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. గ్రూప్-1 విషయంలో బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను ఖండించిన దయాకర్. 24 గంటల్లోకేటీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు.






