ఆకారమే కాదు ఆలోచన కూడా పెద్దదిగా ఉండాలి.. హరీష్ రావుపై ఎమ్మెల్సీ ఫైర్

by Gantepaka Srikanth |

చూడడానికి ఆకారం పెద్దగా ఉంటే సరిపోదు.. ఆలోచన కూడా పెద్దదిగానే ఉండాలని హరీష్ రావుపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఆకారమే కాదు ఆలోచన కూడా పెద్దదిగా ఉండాలి.. హరీష్ రావుపై ఎమ్మెల్సీ ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: చూడడానికి ఆకారం పెద్దగా ఉంటే సరిపోదు.. ఆలోచన కూడా పెద్దదిగానే ఉండాలని హరీష్ రావుపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎస్ఎల్‌బీసీ టన్నెల్ వద్ద అనుకోని ప్రమాదం జరిగి కార్మికులు చనిపోతే.. ప్రభుత్వం మీద బురదజల్లడమే పనిగా మాట్లాడటం సరికాదని అన్నారు. సోమవారం బల్మూరి వెంకట్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రతీ విషయంలోనూ హరీష్ రావు రాజీనామా చేస్తా అంటాడు, రుణమాఫీ విషయంలో సవాల్ చేసి ఎందుకు రాజీనామా చేయలేదన్నారు. రాజీనామా చేయకపోగా.. మాట మార్చారని ఎద్దేవా చేశారు. ప్రతీ విషయంలో ఆరోపణలు చేయడం, సవాళ్లు చేయడం, తర్వాత సైలెంట్ కావడం హరీష్ రావుకు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. బాధ్యతగల ప్రభుత్వంగా ఎస్ఎల్ బీసీ విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తుంటే, విమర్శలు చేయడం సరైంది కాదన్నారు.

రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతన్న సమయంలో ఇబ్బందిగా ఉండకూడదనే సీఎం రాలేదని, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్నారన్నారు. కొండగట్టు ప్రమాదం జరిగినా పట్టించుకోకుండా కేసీఆర్‌లా ఫాంహౌజ్‌లో పడుకోలేదని, ఆరోజు ముఖ్యమంత్రి రాలేదని మీరెందుకు ప్రశ్నించలేదన్నారు. ఏ సమయంలో ఎలా? వ్యవహరించాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బాగానే తెలుసునని పేర్కొన్నారు.

Next Story