- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MLC: కేటీఆర్ కాదు.. కవితే ఎక్కువ దోచుకున్నది
తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం(Kalvakuntla Family) పోటీ పడి మరీ దోచుకుందని కాంగ్రెస్(Telangana Congress) ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్(Balmuri Venkat) తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం(Kalvakuntla Family) పోటీ పడి మరీ దోచుకుందని కాంగ్రెస్(Telangana Congress) ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్(Balmuri Venkat) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై కవిత చేసిన వ్యాఖ్యలకు బల్మూరి వెంకట్ కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్(KCR) ఫామ్‌హౌజ్‌లో ఉండి జీతం తీసుకుంటున్నారు.. సీఎం రేవంత్ రెడ్డి 24 గంటలు చిత్తశుద్ధితో రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు.. ఇదరికీ చాలా తేడా ఉందని అన్నారు. ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలని.. మాట అనేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని హితవు పలికారు. గతంలో కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish Rao)లు అధికారులపై దాడులు చేసిన విషయాన్ని మర్చిపోయారా? అని కవితను ప్రశ్నించారు. పదేళ్లలో రాష్ట్రాన్ని కేటీఆర్ కంటే ఎక్కువ కవితే దోచుకున్నదని ఆరోపించారు.
కాగా, అంతకుముందు కవిత మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ(Congress Party) అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని, ఇకనైనా నిజాలు మాట్లాడాలని సూచించారు. కాంగ్రెస్ తాము ఇన్నాళ్లు చెప్పినవి అబద్ధాలు అని ఒప్పుకుంటే మర్యాదగా ఉంటుందని అన్నారు. రాష్ట్రం అప్పులు మొత్తం రూ.4.42 లక్షలుగా పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని, కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం రూ.8 లక్షల కోట్లు అప్పులున్నాయని దష్ప్రచారం చేస్తున్నారని కవిత విమర్శించారు. అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా నిజాలు చెప్పాలని అన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన బల్మూరి వెంకట్.. బీఆర్ఎస్ ముఖ్య నేతలపై విమర్శలు చేశారు.






