25 ఎకరాలు వారికి కట్టబెట్టినప్పుడు గుర్తులేదా?.. కేటీఆర్‌పై కాంగ్రెస్ MLC ఫైర్

by Gantepaka Srikanth |   (  Updated:2025-04-01 12:48:19  IST  )

హైదరాబాద్‌లోని మై హోం విహంగ(My Home Vihanga) వద్ద విద్యార్థి నాయకులతో కలిసి కాంగ్రెస్(Telangana Congress) ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్(Balmuri Venkat) ఆందోళన చేపట్టారు.

25 ఎకరాలు వారికి కట్టబెట్టినప్పుడు గుర్తులేదా?.. కేటీఆర్‌పై కాంగ్రెస్ MLC ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని మై హోం విహంగ(My Home Vihanga) వద్ద విద్యార్థి నాయకులతో కలిసి కాంగ్రెస్(Telangana Congress) ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్(Balmuri Venkat) ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీపై బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP) నేతలు లేని ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నారని విమర్శించారు. కంచె గచ్చిబౌలి(Gachibowli)లోని సర్వే 25లో 2004 లో 534 ఎకరాలు ప్రభుత్వానికి ఇస్తున్నట్టు HCU రిజిస్ట్రార్ సంతకం చేశారని గుర్తుచేశారు. ఇందుకు బదులుగా ప్రభుత్వం తిరిగి 397 ఎకరాలు ఇస్తున్నట్లు సంతకం చేసిందని అన్నారు. 534 ఎకరాల్లో 400 ఎకరాలు IMG భారత్‌కు, 120 ఎకరాలు ఉద్యోగ సంఘాలకు కేటాయించారని అన్నారు. IMG భారత్ ఒప్పందం ప్రకారం వ్యవహరించలేదు.. దీంతో ఆ భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళకుండా ప్రభుత్వం న్యాయ పోరాటం చేసింది. 400 ఎకరాలు ప్రభుత్వ భూమిగా కోర్టుల్లో కోట్లాది ప్రభుత్వం సాధించిందని అన్నారు.


ఈ భూములు ప్రైవేట్ వ్యక్తులకు చెందాలని కొందరు భావించారు.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మై హోం విహంగ(My Home Vihanga)కు 25 ఎకరాలు కట్టబెట్టారు.. ఇక్కడ పెద్ద భవనాలు నిర్మించారు.. రెండు భవనాలకే వంద ఫీట్ల రోడ్డు వేశారు.. ఉద్యోగ సంఘాలకు కేటాయించిన భూమిలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తప్పుడు పేర్లతో 20 ఎకరాలు ఆక్రమించే ప్రయత్నం చేశారని బల్మూరి వెంకట్ ఆరోపించారు. ఆ 20 ఎకరాలు తిరిగి ప్రభుత్వం లాక్కుంటుందనే భయంతోనే శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వంపై బురదజల్లేలా మాట్లాడుతన్నారని అన్నారు. పర్యావరణం దెబ్బతింటుందని.. మై హోం విహంగాకు 25 ఎకరాలు ఇచ్చినప్పుడు కేటీఆర్‌కు కనిపించలేదా? ప్రశ్నించారు. లోపాయికారీ ఒప్పందాలు లేకపోతే మై హోం నిర్మాణం చేస్తున్నప్పుడు ఎందుకు స్పందించలేదని అడిగారు. వ్యక్తిగత స్వార్థం కోసమే ప్రభుత్వ భూమిని మై హోంకు కట్టబెట్టారని అన్నారు.

Next Story