- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MLC: కేటీఆర్‌కు జైలు భయం పట్టుకుంది
బీఆర్ఎస్(BRS) ముఖ్య నేతలు కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish Rao)పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్(Balmuri Venkat) తీవ్ర విమర్శలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) ముఖ్య నేతలు కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish Rao)పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్(Balmuri Venkat) తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం మండలిలోని మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. కేటీఆర్‌లాగే హరీష్ కూడా మాట్లాడుతున్నారని విమర్శించారు. కేటీఆర్‌కు జైలు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. ఫార్ములా-ఈ రేస్(Formula-E Race)పై విచారణ జరిపిస్తే ఎవరు తప్పు చేశారో తెలుస్తుందని అన్నారు. విచారణకు సహకరించకుండా కోర్టులో పిటిషన్ వేశారని ఫైర్ అయ్యారు.
రేపు జనంలోకి వెళితే బీఆర్ఎస్ నేతలను తరిమికొడతారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. ఫార్ములా-ఈ కార్ రేస్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు కేటీఆర్‌పై ఈసీఐఆర్ నమోదు చేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం కేటీఆర్‌తో పాటు అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, అప్పటి హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిపై ఈడీ కేసు నమోదు చేసింది.






