- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఇప్పుడు వెళ్లి అక్కడ నిద్ర చేయండి’.. కిషన్ రెడ్డికి MLC సవాల్
భారీ వర్షాల వల్ల హైదరాబాద్‌లోని మూసీ(Musi) నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. పరిసర ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: భారీ వర్షాల వల్ల హైదరాబాద్‌లోని మూసీ(Musi) నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. పరిసర ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy)కి కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్(Balmoor Venkat) కీలక సవాల్ విసిరారు. శనివారం గాంధీ భవన్‌లో బల్మూర్ వెంకట్ మాట్లాడుతూ.. మూసీ ముంపు ప్రాంతంలో బీజేపీ నేతలు ఇప్పుడు నిద్ర చేయాలని సవాల్ చేశారు. గతేడాది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు, నిద్ర చేసిన ఇల్లు కూడా ఇవాళ వరద నీటిలో మునిగిపోయాయి. ఇప్పుడు వెళ్లి అక్కడ నిద్ర కార్యక్రమం చేయగలరా? అని ప్రశ్నించారు. మూసీ ముంపు బాధితులకు శాశ్వత పరిష్కారం చూపే ప్రయత్నం ప్రభుత్వం చేస్తే అడ్డుకునే ప్రయత్నం చేయడం ఇకనైనా మానుకోండి అని హితవు పలికారు. ఆనాడు మూసీలో దొంగ నిద్రలు చేసిన కేంద్ర మంత్రులు, కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పుడు ఎక్కడ పోయారని సెటైర్ వేశారు. రాజకీయ పార్టీ నేతలు, రాజకీయాలను పక్కన పెట్టి, మూసీ ముంపు ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వానికి మద్దతివ్వాలని అన్నారు.
మూసీ ముంపు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వర్షాలు తగ్గే వరకు రిలీఫ్ క్యాంపులలోనే ఉండాలి. మరో రెండు రోజుల వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలంతా ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిలీఫ్ క్యాంపులకు తరలి వెళ్లాలి. రిలీఫ్ క్యాంపులలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి సమస్య ఉన్న పోలీసులు, జీహెచ్‌ఎంసీ, హైడ్రా వంటి అత్యవసర సేవలను ఉపయోగించుకోవాలని కోరారు.






