ఆ చేపల పులుసును కవిత కూడా లొట్టలేసుకుంటూ తిన్నారు.. బల్మూరి వెంకట్ హాట్ కామెంట్స్

by Gantepaka Srikanth |

బీఆర్ఎస్(BRS) నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha)పై కాంగ్రెస్ యువ నేత, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్(Balmuri Venkat) సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆ చేపల పులుసును కవిత కూడా లొట్టలేసుకుంటూ తిన్నారు.. బల్మూరి వెంకట్ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha)పై కాంగ్రెస్ యువ నేత, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్(Balmuri Venkat) సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం సీఎల్పీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా లేదా..? అని ప్రశ్నించారు. కేసీఆర్ వద్ద మార్కుల కోసమే కవిత తరచూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బనకచర్ల ప్రాజెక్ట్‌పై చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కేసీఆర్, హరీష్ రావుకు ఇప్పటికే సవాల్ విసిరారు.. ఫామ్‌హౌజ్‌లో చిల్ అవుతూ వాళ్లు ఇప్పటివరకూ స్పందించలేదని మండిపడ్డారు. మాజీ మంత్రి రోజా ఇంట్లో చేపల పులుసు పెట్టినప్పుడు కేసీఆర్ పక్కన కవిత కూడా ఉన్నారు.. కవిత కూడా లొట్టలేసుకుంటూ తిన్నారని హాట్ కామెంట్స్ చేశారు. రాయలసీమను రతనాల సీమ చేస్తానని కేసీఆర్ చెప్పినప్పుడు కవిత పక్కనే ఉన్నారని గుర్తుచేశారు.

బనకచర్లకు నాంది పలికిందే కేసీఆరే అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు న్యాయం చేస్తుంటే.. తట్టుకోలేక విమర్శలు చేస్తున్నారని సీరియస్ అయ్యారు. 9 రోజుల్లో 9 వేల కోట్ల రైతు భరోసా నిధులు ఇస్తే కవితకు కనబడటం లేదా..? అని అడిగారు. ఉచిత ఆర్టీసీ ప్రయాణం, 500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల విద్యుత్ ఫ్రీ, రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ కవితకు కనిపించడం లేదా? ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో చేసిన అప్పులు తీర్చడానికే మా ప్రభుత్వం అప్పులు చేస్తున్నదని చెప్పారు. ప్రజలు పదేళ్లు అవకాశం ఇస్తే.. ప్రతిపక్ష నేతలు ఫోన్లు ట్యాపింగ్ చేసి పబ్బం గడిపే ప్రయత్నం చేశారని అన్నారు. కవిత ఫోన్ కూడా ట్యాపింగ్‌కు గురైందని కీలక వ్యాఖ్యలు చేశారు. భార్యాభర్తల సంభాషణలు విన్నారు.. కొంతమంది భార్యాభర్తలు విడిపోవడానికి కారణమయ్యారు.. కుటుంబాల్లో గొడవలు పెట్టి పైశాచిక ఆనందం పొందారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కవితకు కొంచమైనా మానవత్వం ఉంటే ట్యాపింగ్ చేసిన వారిని చెప్పుతో కొట్టాలి.. ఆ తర్వాత బయటకు వచ్చి మాట్లాడితే ప్రజలు నమ్ముతారని అన్నారు.

Next Story