- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్లాక్ మెయిలర్ మా ఎమ్మెల్యే? కౌశిక్‌రెడ్డిని దేశం దాటించే ప్రయత్నం: ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నీ కూడా దేశం దాటించాలని చూశారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ హాట్ కామెంట్స్ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎట్లా అయితే దొంగలను బయట దేశాలకు పంపినట్టు.. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) నీ కూడా దేశం దాటించాలని చూశారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ (MLC Balmuri Venkat) హాట్ కామెంట్స్ చేశారు. ఇవాళ (శనివారం) గాంధీభవన్ ఆయన మీడియాతో మాట్లాడారు. పైసల దందాలో కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యారని అన్నారు. ప్రజా సమస్యలపై కౌశిక్ రెడ్డి ఏమైనా ఉద్యమం చేశారా? కేటీఆర్, హరీశ్‌రావు (Harish Rao)కి సిగ్గుండాలి, ఒక్క దొంగకి సపోర్ట్ చేస్తున్నారని విమర్శించారు. క్రషర్ వాళ్లను పైసల కోసం వాళ్లని బ్లాక్ మెయిల్ చేస్తే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారని స్పష్టం చేశారు. క్రషర్ వాళ్లు కేసు పెట్టిన తర్వాత గుండెడు గ్రామ ప్రజలకు పది లక్షల చెక్ గుడి కోసం ఇచ్చారని అన్నారు.
కౌశిక్ రెడ్డి ది బ్లాక్ మెయిల్ చరిత్ర.. ఉద్యోగాలు ఇప్పిస్తానని కౌశిక్ రెడ్డి పైసలు తీసుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. బ్లాక్ మెయిలర్ మా ఎమ్మెల్యేనా? అని హుజూరాబాద్ నియోజక వర్గ ప్రజలు బాధపడుతున్నారు. దొంగలకు సపోర్ట్ చేయకండి ((KTR) కేటీఆర్, హరీశ్‌రావుకు సూచించారు. మీరు చేసిన దొంగతనాలు బయట పడతాయని బావ బామ్మర్ధులు బనకచర్ల విషయంలో ముందు మాట్లాడుతున్నారని అన్నారు.
బనకచర్ల విషయంలో జగన్‌తో లోపాయకర ఒప్పందాలు చేసుకుంది మీరు కాదా? అని ప్రశ్నించారు. బావ బామ్మర్ధులకు దమ్ము ధైర్యం ఉంటే బనకచర్ల విషయంలో ప్రమాణం చేయాలని సవాల్ చేశారు. కౌశిక్ రెడ్డి ది ప్రజల్ని మోసం చేసిన చరిత్ర ఘటనలు కోకొల్లలు ఉన్నాయని తెలిపారు. వాసాలమర్రిలో ఆగమ్మకు ఇల్లు ఇస్తామని చెప్పి ఇల్లు కట్టలేదు.. కల్వకుంట్ల కవిత మీ నాన్న పేపర్ టైగర్.. ఆగమ్మకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిందన్నారు. ఆగమ్మకు మీ అయ్యా ఇల్లు ఇచ్చి ఉంటే మేము ఇల్లు ఎందుకు ఇవ్వాల్సి వచ్చేదని అన్నారు.






