- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎంపీ ఓట్లు అవుట్‌సోర్స్.. బీఆర్ఎస్ భవిష్యత్తుపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఘాటు విమర్శలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఘాటు విమర్శలు చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో : గత ఎంపీ ఎన్నికల్లో అవుట్ సోర్సింగ్ పద్దతి లాగా మీ పార్టీ ఓట్లు బీజేపీకి పడేటట్లు చేసుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ (Addanki Dayakar) ఘాటు విమర్శలు చేశారు. కనుమరుగు అవుతున్న బీఆర్ఎస్ ను నిలపాలన్న తాపత్రయంలో నేతలు చేరుతున్నట్లు కార్యక్రమాలు చేస్తున్నారని అద్దంకి దయాకర్ విమర్శించారు. ఆదివారం మీడియాతో అద్దంకి మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ గ్రామ స్థాయి నేతలు వెళ్లిపోతున్నారని, కాంగ్రెస్‌తోనే భవిష్యత్తు ఉందని వారంతా భావిస్తున్నారని అన్నారు.
కేటీఆర్ పార్టీని కాపాడుకునే సమర్ధత లేదని, ఆయనకు వాళ్ల బావ మీద అనుమానం ఉందని, చెల్లెలు కవితను పార్టీ నుంచి బయటకు పంపిన తీరుతో పార్టీ ఉనికి ప్రశ్నార్థకం అవుతోందని అద్దంకి దయాకర్ అన్నారు. నేతల చేరికల వ్యవహారంలో చట్టాల పట్ల (Congress) కాంగ్రెస్‌పై గౌరవం ఉన్నందునే బీఆర్ఎస్ ఖాళీ కాలేదని, ఆ విషయం కేటీఆర్ తెలుసుకోవాలన్నారు.






