- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముందు మీ చెల్లెకు సమాధానం చెప్పు కేటీఆర్.. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఫైర్
కేటీఆర్ నీ బుడ్డర్ఖాన్ మాటలు బంద్ చెయ్.. అని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కేటీఆర్ (KTR) నీ బుడ్డర్ఖాన్ మాటలు బంద్ చెయ్.. అని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ (Addanki Dayakar) ఫైర్ అయ్యారు. ఇంట్లో వస్తున్న సమస్యలు పరిష్కరించుకోలేక ప్రస్టేషన్‌తో మాట్లాడుతున్న కేటీఆర్ మాటలు ఎవరూ పట్టించుకోరని అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం తన ఎక్స్ ఖాతా వేదికగా ఒక వీడియో విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ మీద బీజేపీ అక్రమంగా పెట్టిన కేసులు బూచిగా చూసుకొని ఎర్రి పప్పలాగా మాట్లాడుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ,రాహుల్ గాంధీ మీద పెట్టిన కేసులు ఎలాంటివో దేశ ప్రజలకు తెలుసన్నారు. బీజేపీ నాయకుల కంటే ముందు కేటీఆర్ మాట్లాడటం అనేది (BRS) బీఆర్ఎస్ బీజేపీకి ఏజెంట్‌గా మారిందని నిలువెత్తు సాక్ష్యంగా కనిపిస్తుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణను దొంగల దొడ్డిగా మార్చిన దొంగల కుటుంబం కేటీఆర్ దని, అవినీతి గురించి, రేవంత్ రెడ్డి గురించి కేటీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు.
బీజేపీ (BJP) మీద రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఎలా పోరాటం చేస్తున్నారో కనీస అవగాహన లేని సన్నాసి కేటీఆర్ అని మండిపడ్డారు. తెలంగాణని పిండి పిప్పి చేసి తెలంగాణ ప్రజలను మోసం చేసిన మీరు చెప్తే ఎవరు వింటారు కేటీఆర్.. ఫస్ట్ నీ ఇంట్లో నుంచి బయటికి పోయి నిన్ను దొంగగా చిత్రీకరించిన నీ చెల్లికి సమాధానం చెప్పు.. అని నిలదీశారు. గతంలో ఎన్నిసార్లు మిమ్మల్ని దిగిపోమన్న సిగ్గు, లజ్జా లేకుండా దిగిపోనిది మీ పరిస్థితి అని పేర్కొన్నారు. కేటీఆర్ ఆవేశం, ఆత్రుత అంతా తన పరిస్థితి డోలాయమానంలో పడ్డది అనేది కనిపిస్తుందని అభిప్రాయపడ్డారు. కేటీఆర్ పార్టీలో వచ్చిన సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని దేశం కోసం పోరాటం చేసినట్లు కేటీఆర్ ఆయన చేసిన యాక్టింగ్ ను ఎవరు నమ్మరని అన్నారు. నువ్వు ముందు నీ ఇంటిని సరిదిద్దుకో కేటీఆర్.. రేవంత్ రెడ్డి మీద మీరు, బీజేపీ పెట్టిన కేసులను ఎదుర్కొనే దమ్ము సత్తా ఆయనకు ఉందని అన్నారు. మీ అయ్య, మీ బావ కాళేశ్వరంలో మీ చెల్లె లిక్కర్ కేసులో నువ్వు ఈ ఫార్ములా కేసులో పూర్తిగా కురుకుపోయి.. ఏమి చేయాలో తెలియని పరిస్థితి లో కేటీఆర్ కామెంట్స్ చేస్తున్నారని సభ్య సమాజానికి తెలుసన్నారు.






