‘తిరుగుబాటుకు నేనే నాయకత్వం వహిస్తా’: కాంగ్రెస్ MLA షాకింగ్ స్టేట్మెంట్

by Gantepaka Srikanth |

కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు(MLA Vedma Bhojju) మరో కీలక ప్రకటన చేశారు.

‘తిరుగుబాటుకు నేనే నాయకత్వం వహిస్తా’: కాంగ్రెస్ MLA షాకింగ్ స్టేట్మెంట్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు(MLA Vedma Bhojju) మరో కీలక ప్రకటన చేశారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలోని జన్నారం మండల కేంద్రంలో ప్రభుత్వం మంజూరు చేసిన రేషన్ కార్డులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అడవుల్లో వెళ్లారని బీసీలను, గొర్రెలు, మేకల కాపరులను అడ్డుకుంటే తిరగబడతారని అటవీశాఖ అధికారులకు సూచించారు. అంతేకాదు.. వారి తిరుగుబాటుకు నేనే నాయకత్వం వహిస్తా అని సంచలన ప్రకటన చేశారు. అడవుల్లో కలప ఎలా మాయమవుతోంది? అని ప్రశ్నించారు. గిరిజనేతరులు సాగు చేసుకుంటున్న పోడు భూముల జోలికి వెళ్లొద్దని హితవు పలికారు. పశువుల కాపరులు, మేదరులు అటవిలోకి వెళితే వారిని ఇబ్బంది పెడితే, ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక విషయంలో ఇబ్బందులకు గురిచేస్తు ఊరుకునేది లేదని హెచ్చరించారు. అంతకుముందు జీవో నెంబర్.49 మళ్లీ తీసుకొస్తే ఏమాత్రం ఆలోచించకుండా.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Next Story