- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డ్రగ్స్ టెస్ట్ తర్వాతే సినిమాల విడుదలకు అనుమతివ్వాలి: కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో ఇప్పపువ్వు సారాపై తాను మాట్లాడితే ట్రోలింగ్ చేశారని మండిపడ్డారు.

దిశ, వెబ్‌డెస్క్: జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో ఇప్పపువ్వు సారాపై తాను మాట్లాడితే ట్రోలింగ్ చేశారని మండిపడ్డారు. మంగళవారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ట్రోలర్స్‌పై మండిపడ్డారు. రాజకీయ నాయకుడిగా తాను సారా గురించి మాట్లాడితే ట్రోల్స్ చేస్తున్నారు. ఇదే సారాను ఖుషీ సినిమాలో పవన్ కల్యాణ్ తాగుతున్నట్లు నటించారు. అప్పుడు జనాలు ఈలలు కేకలు వేశారు. అదేవిధంగా నందమూరి బాలకృష్ణ ఏకంగా ‘మామ ఏక్ పెగ్ లా’ అనే పాటకు డ్యాన్స్ చేసినా ఎంజాయ్ చేశారు. అదే మేము ప్రజల ఆరోగ్యం గురించి ఇప్పపువ్వు ప్రస్తావన తీసుకొస్తే ట్రోల్స్ చేస్తున్నారు. ఇది సరైన పద్దతి కాదని అనిరుధ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇకపై సినిమా యాక్టర్లంతా డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలని సంచలన డిమాండ్ చేశారు. డ్రగ్స్ టెస్ట్ చేయించుకుంటేనే వారి సినిమాల విడుదలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. డ్రగ్స్ టెస్ట్ చేయించుకోని యాక్టర్లు.. డ్రగ్స్ తీసుకున్నట్లే అని హాట్ కామెంట్స్ చేశారు. తాను ఎవర్నీ తప్పుబట్టడం లేదని.. అందరూ బాధ్యతగా ఉండాలని అనుకుంటున్నట్లు తెలిపారు. గ్రామాల్లో కూడా మద్యం తాగొద్దని భర్తలతో భార్యలు ఒట్టువేయించుకోవాలని కోరారు.






