- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేటీఆర్ ఓ బచ్చా : కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్
బీఆర్ఎఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పై కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(MLA Gandra Satyanarayana Rao) తీవ్ర విమర్శలు చేసారు.

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పై కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(MLA Gandra Satyanarayana Rao) తీవ్ర విమర్శలు చేసారు. కేటీఆర్ ఒక బచ్చా అని, రాజకీయ జ్ఞానం లేని కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదని అన్నారు. BRS నాయకులు అక్రమంగా సంపాదించిన డబ్బుతో కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. అయినప్పటికీ వారి తీరు మారలేదని మండిపడ్డారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రజలు గులాబీ పార్టీని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
అలాగే హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కూడా "బచ్చాగాడు" అని విమర్శిస్తూ.. కౌశిక్ రెడ్డికి తెలంగాణ ప్రభుత్వంపై మాట్లాడే అర్హత లేదన్నారు. పదేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసారని, అన్ని శాఖల్లో భారీగా అవినీతికి పాల్పడ్డారని ఫైర్ అయ్యారు. అవినీతి కేసుల నుంచి కాపాడుకోవడానికి బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకున్నారని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేసారు.






