- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇల్లు అనేది కేవలం ఆశ్రయం మాత్రమే కాదు.. అది గౌరవం: కాంగ్రెస్ MLA ఆసక్తికర వ్యాఖ్యలు
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల(Indiramma indlu) నిర్మాణ పనులకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(Naini Rajender Reddy) శంకుస్థాపన చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల(Indiramma indlu) నిర్మాణ పనులకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(Naini Rajender Reddy) శంకుస్థాపన చేశారు. 60వ డివిజన్ వడ్డేపల్లి, 58వ డివిజన్ కాలనీ, 57వ డివిజన్ సమ్మయ్యనగర్‌లో లబ్ధిదారులకు కేటాయించిన ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి, పనులను ప్రారంభించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పేదలకు ఇళ్ల నిర్మాణాలు చేపట్టామని, రాష్ట్రంలో చాలా చోట్ల ఇందిరమ్మ కాలనీలు ఉంటాయని గుర్తుచేశారు. పశ్చిమ నియోజకవర్గంలో మొత్తం 3500 ఇళ్లకు గాను ప్రతి ఒక్క ఇల్లు నిజమైన అర్హులకు కేటాయించామని తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఇల్లు అనేది ఒక వ్యక్తికి ఆశ్రయం మాత్రమే కాదు – అది గౌరవం, భద్రత, స్వాతంత్ర్యం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పానికి అనుగుణంగా ప్రతి పేద కుటుంబానికి ఇంటి కలను సాకారం చేయడమే మా ధ్యేయం అని తెలిపారు. మొత్తం మూడు డివిజన్లలో ప్రారంభించిన ఇండ్ల నిర్మాణ పనులు వందలాది కుటుంబాలకు ఆశ కలిగించాయని తెలిపారు. లబ్ధిదారులు తమ మనసు తల్లడి కళ్లలో ఆనందంతో ఎమ్మెల్యే గారిని ప్రత్యేకంగా సన్మానించారు. అంతకుముందు 60వ డివిజన్ వడ్డేపల్లి కాలనీలో రూ.5 లక్షలతో కల్వర్ట్ నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీ సంఘాల నాయకులు, అధికారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ట్వీట్






