- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్ కుటుంబంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్
కేసీఆర్ కుటుంబంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నేతలపై వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు(MLA Nagaraju) హాట్ కామెంట్స్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లిక్కర్ గురించి మాట్లాడే హక్కు కేటీఆర్‌కు లేదని అన్నారు. కేసీఆర్ కుటుంబం అంటేనే లిక్కర్ మాఫియా అని అన్నారు. దేశంలో తెలంగాణకు విలువ లేకుండా చేసిన పాపం కేసీఆర్ కుటుంబానిదే అని చెప్పారు. టెండర్‌లు కాకుండానే లిక్కర్ కుంభకోణం జరిగిందని కేటీఆర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆధారాలు ఉంటే చూపించాలి.. కానీ అడ్డగోలుగా ఆరోపణలు చేయడం సరికాదు అని హితవు పలికారు. టానిక్ పేరుతో కేటీఆర్, సంతోష్ రావులు కలిసి మద్యం వ్యాపారం చేయలేదా? అని ప్రశ్నించారు. కేటీఆర్ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేటీఆర్ మాటలు వింటుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందని విమర్శించారు. టానిక్ పేరుతో మీరు ఎంత దోసుకున్నారో నిరూపిస్తామని సవాల్ చేశారు. దీనిపై జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో ప్రమాణం చేయడానికి కూడా సిద్ధమని ప్రకటించారు. మీ రాజకీయాల్లోకి సీఎం అల్లుడిని లాగడం సిగ్గుచేటు.. మరోసారి ఇష్టమున్నట్టు మాట్లాడితే తగిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మద్యం టెండర్లలో ఎలాంటి జరగలేదు అక్రమాలు జరుగలేదు.. రిజ్వీ మంచి అధికారి.. ఆయన తన ఇష్టంతోనే వీఆర్ఎస్ తీసున్నారని అన్నారు.






