అధికారంలోకి తర్వాత.. ముందు అసెంబ్లీకి రండి: కేసీఆర్‌కు ఎమ్మెల్యే సూచన

by Gantepaka Srikanth |

తెలంగాణ వ‌చ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబం సంచులు స‌ర్దుకుందని, కేసీఆర్ అసెంబ్లీకే రావ‌డం లేదు.. ఇక తెలంగాణ‌లో మీరు అధికారంలోకి వ‌స్తారా? అని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ప్రశ్నించారు.

అధికారంలోకి తర్వాత.. ముందు అసెంబ్లీకి రండి: కేసీఆర్‌కు ఎమ్మెల్యే సూచన
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ వ‌చ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబం సంచులు స‌ర్దుకుందని, కేసీఆర్ అసెంబ్లీకే రావ‌డం లేదు.. ఇక తెలంగాణ‌లో మీరు అధికారంలోకి వ‌స్తారా? అని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ప్రశ్నించారు. బుధవారం ఆయన సీఎల్పీలోని మీడియా సెంటర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తానే తెలంగాణ తెచ్చాన‌ని కొంద‌రు ప‌నికి మాలిన మాట‌లు మాట్లాడుతున్నారని, వేలాది మంది అమ‌రువీరుల త్యాగం వ‌ల్లనే తెలంగాణ వ‌చ్చిందన్నారు. తెలంగాణ అమ‌రువీరుల త్యాగాన్ని చూసి సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందని తెలిపారు. గ‌తం ప్రభుత్వంలో ఆర్టీసీ స‌మ్మె కార‌ణంగా కార్మికులు చ‌నిపోయారు. ఆర్టీసీలో స‌మ్మెను బీఆర్ఎస్ నాయ‌కులు ప్రోత్సహిస్తున్నారు.

ఆర్టీసీ కార్మికులు మంది మాట‌లు న‌మ్మెద్దన్నారు. స్మశాన వాటిక‌లు, బొంద‌లు గ‌డ్డలు త‌ప్ప బీఆర్ఎస్ హ‌యాంలో చేసింది ఏమీ లేదని మందుల సామేల్ ఆరోపించారు. రేవంత్ రెడ్డిని చూసి బీఆర్ఎస్ నాయ‌కుల‌కు క‌ళ్ల మంట‌.. గుంటన‌క్క ఢిల్లీకి పోయింద‌ని క‌విత‌నే హ‌రీష్ రావు గురించి చెపుతోందని, సీఎం పైన హ‌రీష్ రావు చేసే విమ‌ర్శల‌ను ప్రజలు న‌మ్మరన్నారు. అధికారం పోగానే బీఆర్ఎస్ పార్టీ ఆర్టీసీ కార్మికులు, ఆశా వ‌ర్కర్లు, నిరుద్యోగులు గుర్తుకొచ్చారని, మ‌ళ్లీ రాజ్యాధికారం కాంగ్రెస్ పార్టీదేనని మందుల సామేల్ స్పష్టం చేశారు. తెలంగాణ‌ రాకముందు, వచ్చిన తర్వాత క‌ల్వకుంట్ల ఆస్తులు ఎన్నో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Next Story