‘తమిళనాడు విజయ్‌ని చూసి నేర్చుకో’.. కేటీఆర్‌కు ఎమ్మెల్యే సలహా..

by Gantepaka Srikanth |   (  Updated:2026-05-07 10:48:20  IST  )

వరంగల్ వేదికగా రైతు సంగ్రామ సభ పేరుతో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు విన్న ప్రజలు ఆశ్చర్యపోతున్నారని ప్రభుత్వ విప్ విమర్శించారు.

‘తమిళనాడు విజయ్‌ని చూసి నేర్చుకో’.. కేటీఆర్‌కు ఎమ్మెల్యే సలహా..
X

దిశ, వెబ్‌డెస్క్: వరంగల్ వేదికగా రైతు సంగ్రామ సభ పేరుతో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు విన్న ప్రజలు ఆశ్చర్యపోతున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మీడియాతో విమర్శించారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ చదువుకున్న నాయకుడు, విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి అని ప్రజలు భావించేవారు. కానీ అధికారం కోసం ఎంతకైనా దిగజారే స్థాయికి వెళ్లారనే భావన ఇప్పుడిప్పుడే ప్రజల్లో కలుగుతోంది. సీఎం కుర్చీ ఎలా దక్కించుకోవాలో చెప్పిన కేసీఆర్, ప్రజల విశ్వాసం ఎలా నిలబెట్టుకోవాలో మాత్రం చెప్పలేకపోయారు. రైతుల సభ పెట్టి రైతుల సమస్యలపై మాట్లాడకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని యెన్నం శ్రీనివాస్ రెడ్డి హితవు పలికారు.

అధికారంలో భాగస్వామ్యం ఇస్తాం.. వామపక్షాలకు టీవీకే బంపరాఫర్


రైతు అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే రైతు..

దేశంలో రైతు రుణమాఫీ అమలు చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్. రైతులకు ఉచిత విద్యుత్ అందించింది దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు దశాబ్దాలైనా నిలకడగా కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో ప్రతిష్టా్త్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు “కుళేశ్వరం”గా మారింది. కృంగిపోయిందని విమర్శించారు. అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్‌పై అవాకులు, చవాకులు మాట్లాడటం కేటీఆర్‌కు అలవాటైందని మండిపడ్డారు. కేసీఆర్ ఇంట్లో “బొమ్మరిల్లు” సినిమాలో కుటుంబ పంచాయతీ నడుస్తోందని ఎద్దేవా చేశారు.

రూలర్‌వా.. జోకర్‌వా..

‘గతంలో రేవంత్ రెడ్డికి జెడ్పీటీసీ సీటు ఇవ్వడానికి కూడా బీఆర్ఎస్ నిరాకరించింది. కానీ రేవంత్ రెడ్డి స్వయంకృషితో జెడ్పీటీసీగా గెలిచారు. కొడంగల్‌లో ఓడినా, మల్కాజిగిరిలో భారీ మెజారిటీతో గెలిచి ప్రూవ్ చేసుకున్నారు. తెలంగాణ ప్రజలకు కేటీఆర్ జోకరో.. రూలరో తెలియడం లేదని తీవ్ర విమర్శలు చేశారు. తమిళనాడు నాయకుడు విజయ్‌ను చూసైనా కేటీఆర్ రాజకీయ సంస్కారం నేర్చుకోవాలి. ఇదే తీరు కొనసాగితే సిరిసిల్లలో కూడా కేటీఆర్ సిరిసిల్లలో గెలవలేరు. ప్రజలను తక్కువ అంచనా వేస్తూ మాట్లాడితే రాజకీయంగా ప్రజలే సమాధి చేస్తారని యెన్నం శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు.

Next Story