Yashaswini Reddy: కన్నీరు పెట్టుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.. ఎందుకంటే?

by Ramesh Naini |

తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలు పంపిణీ ప్రారంభమైన విషయం తెలిసిందే.

Yashaswini Reddy: కన్నీరు పెట్టుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.. ఎందుకంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో (Indiramma houses) ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలు పంపిణీ ప్రారంభమైన విషయం తెలిసిందే. పేదవారి ఆత్మగౌరవ ప్రతీక సొంత ఇల్లు అని కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకం తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణలోని పలు జిల్లాలలో ఎమ్మెల్యేలు, అధికారులు అర్హులకు ఇండ్ల పత్రాలను అందజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఇవాళ (మంగళవారం) మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలంలో జరుగుతున్న రైతు వేదికలో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి (Congress MLA Yashaswini Reddy) పాల్గొన్నారు. ఈ మేరకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేసే సమయంలో భావోద్వేగానికి గురైన యశస్విని రెడ్డి కంటతడి పెట్టుకున్నారు. దీంతో ఊరుకో అక్కా అంటూ యువ ఎమ్మెల్యేను మహిళలు ఓదార్చారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వంలో తన చేతుల మీదుగా నిరుపేదలకు ఇండ్ల పట్టాలు అందజేయడం నేపథ్యంలో యశస్విని రెడ్డి భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా, ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా అర్హులకు 4 దశల్లో 5 లక్షల ఆర్థిక సహాయం అందుతుంది. దాదాపు 400 నుంచి 600 చదరపు అడుగుల్లో ఇల్లు నిర్మించుకోవాల్సి ఉంటుంది. 4 దశలో గ్రీన్ చానల్ ద్వారా ప్రభుత్వం ఆర్థిక సహాయం ఏర్పాటు చేసింది. బేస్మెంట్ నిర్మాణం పూర్తయిన తర్వాత లక్ష రూపాయలు, గోడలు నిర్మిస్తే లక్ష రూపాయలు, స్లాబ్ నిర్మించిన తర్వాత రూ. 2 లక్షలు, ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత మరో లక్ష రూపాయలు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ అవుతాయయని ప్రభుత్వం ప్రకటించింది.

Next Story