ఆ జీవో మళ్లీ తెస్తే రాజీనామా చేస్తా: కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సంచలన ప్రకటన

by Gantepaka Srikanth |

ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు(MLA Vedma Bhojju) సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆ జీవో మళ్లీ తెస్తే రాజీనామా చేస్తా: కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు(MLA Vedma Bhojju) సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలోని జన్నారం మండల కేంద్రంలో ప్రభుత్వం మంజూరు చేసిన రేషన్ కార్డులను ఎమ్మెల్యే పంపిణీ శారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అటవీశాఖ అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. కవ్వాల్ టైగర్ జోన్‌లో రాకపోకలు ఆపితే ఇక నుంచి చూస్తూ ఊరుకోను అని హెచ్చరించారు. ‘తుక్కు తుక్కుగా కొడతాం.. తరిమి తరిమి కొడతాం’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోడు రైతుల్ని, అడవి బిడ్డలపై ఆంక్షలు పెడితే సహించను అని అన్నారు. పద్ధతి మార్చుకోవాలని ఇప్పటికే ఫారెస్ట్ అధికారులకు అనేకసార్లు చెప్పామని.. అయినా మాట వినట్లేదని మండిపడ్డారు.

సిరిచెల్మలో ముల్తానీల తరహాలో తిరుగుబాటు చేస్తామని కీలక ప్రకటన చేశారు. అంతేకాదు.. జీవో నెంబర్.49 మళ్లీ తీసుకొస్తే ఏమాత్రం ఆలోచించకుండా.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారం(Congress Govt)లోకి రాగానే పేదలను గుర్తించి రేషన్ కార్డులు ఇస్తోందని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు రాని అర్హులైన వారికి అందరికీ ఇండ్లను అందజేస్తామని అన్నారు. పశువుల కాపరులు, మేదరులు అటవిలోకి వెళితే వారిని ఇబ్బంది పెడితే, ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక విషయంలో ఇబ్బందులకు గురిచేస్తే చూస్తూ ఊరుకోము అని అటవీశాఖ అధికారులకు వార్నింగ్ ఇచ్చారు.

Next Story