- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు CID ఆఫీస్‌కు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే.. కారణం ఇదే?
భారత పౌరసత్వం(Indian Citizenship) లేకున్నా తప్పుడు పత్రాలతో ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్(Chennamaneni Ramesh)పై చర్యలు తీసుకోవాలని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ డీజీపీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: భారత పౌరసత్వం(Indian Citizenship) లేకున్నా తప్పుడు పత్రాలతో ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్(Chennamaneni Ramesh)పై చర్యలు తీసుకోవాలని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ డీజీపీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆది శ్రీనివాస్ కంప్లెయింట్‌పైన సీఐడీ అధికారులు విచారణ ప్రాంభించారు. చెన్నమనేని రమేష్‌పైన ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలు అందించడానికి రేపు రావాలని ఆది శ్రీనివాస్(Aadi Srinivas)కు సీఐడీ అధికారులు పిలుపునిచ్చారు.
ఇదిలా ఉండగా.. పౌరసత్వ వివాదంలో హైకోర్టు(High Court) ఆదేశాల మేరకు ఆది శ్రీనివాస్‌కు రూ.25 లక్షలను సోమవారం మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ హైకోర్టు ద్వారా అందజేశారు. తన పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ హైకోర్టులో సవాల్ చేయగా.. ఆయన పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి కొట్టివేసింది. అంతేగాకుండా పౌరసత్వంపై ఫిర్యాదు చేసిన ఆది శ్రీనివాస్‌కు రూ.25 లక్షలు, లీగల్ సర్వీసెస్ అథారిటీకి రూ.5 లక్షలను నెల రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించారు.
కాగా ఈ అంశంపై కోర్టులో ఆది శ్రీనివాస్ సుదీర్ఘ కాలం పోరాటం చేశారు. దీనిపై అనే దఫాలుగా విచారణ చేపట్టిన న్యాయస్థానం.. చెన్నమనేని రమేష్‌కు జర్మనీ పౌరసత్వం(German Citizenship) ఉన్నట్లు తేల్చింది. తప్పుదోవ పట్టించినందుకు ఆయనకు జరిమానా విధించింది.






