KCR సభ కోసం కాలువలు, వాగులను ధ్వంసం చేస్తున్నారు: కాంగ్రెస్ ఎమ్మెల్యే

by velandi.Saikiran |

కేసీఆర్ సభపై ( KCR Meeting) వర్థన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ( Varthannapet MLA Nagaraju) షాకింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస

KCR సభ కోసం కాలువలు, వాగులను ధ్వంసం చేస్తున్నారు: కాంగ్రెస్ ఎమ్మెల్యే
X

దిశ, వెబ్ డెస్క్: కేసీఆర్ సభపై ( KCR Meeting) వర్థన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ( Varthannapet MLA Nagaraju) షాకింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం వ్యవసాయ కాలువలు, వాగులను ధ్వంసం చేస్తున్నారని ఆగ్రహించారు వర్థన్నపేట ఎమ్మెల్యే నాగరాజు. దేవాదుల కాలువను పూర్తిగా పూడ్చేశారని మండిపడ్డారు. వేలాది ట్రిప్పుల మొరం తరలిస్తున్నా పట్టించుకోవడం లేదని తెలిపారు. పూడ్చిన పెద్ద వాగు, దేవాదుల కెనాళ్లపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు వర్థన్నపేట ఎమ్మెల్యే నాగరాజు.

ఇది ఇలా ఉండగా... గులాబీ పార్టీ ( BRS Party)... స్థాపించి 25 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో... రజతోత్సవ సభ కోసం... అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 27వ తేదీన..... గులాబీ పార్టీ భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ భారీ బహిరంగ సభకు వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి వేదిక కానుంది. ఈ సభకు పది లక్షల మంది... వస్తారని గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక సభకు వచ్చేందుకు దాదాపు 3000 బస్సులను... వినియోగించుకోనుంది గులాబీ పార్టీ. ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీకి 8 కోట్లు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.

Next Story