- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rammohan Reddy: హరీశ్ రావు నువ్వు రేవంత్ రెడ్డి వెంట్రుక కూడా పీకలేవు: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కేటీఆర్, హరీశ్ రావులపై ఫైర్ అయ్యారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: రైతు సంక్షేమంపై అసెంబ్లీలో చర్చకు రమ్మంటే బీఆర్ఎస్ నేతలు పారిపోయారని కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి (Rammohan Reddy) అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లారని తెలిసే ప్రెస్ క్లబ్ లో హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు. సీఎల్పీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన.. చర్చ కోసం అసెంబ్లీ సమావేశం ఎప్పుడు నిర్వహించాలో మీ సీఎల్పీ నాయకుడు కేసీఆర్ (KTR) చేత లేఖ ఇప్పించాలని మేము చాలెంజ్ చేస్తే లేఖ ఇవ్వకుండా ప్రెస్ క్లబ్ కు వెళ్లి అబద్దాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మాట ఇచ్చిన్నట్లే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏక కాలంలో రూ.21వేల కోట్ల రైతు రుణమాఫీ చేసిందని, 9 రోజుల్లోనే రూ.9 వేల కోట్లు రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ‘హరీశ్ రావు నాలుక చీరెస్తా అని ఎక్కువ మాట్లాడుతున్నావ్.. హరీశ్ రావు (Harish Rao) నువ్వు సీఎం ఒక వెంట్రుక పీకలేవు’ అని కౌంటర్ ఇచ్చారు. మీ నాయకుడితో ఈ రోజే లెటర్ ఇప్పించండి. సభ ఎప్పుడు పెట్టాలో కూడా మిరే చెప్పండి అందుకు మేము సిద్ధంగా ఉన్నామన్నారు.






