- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘వాళ్లతో ఇక నాకు పనిలేదు’.. కాంగ్రెస్ MLA ప్రేమ్ సాగర్‌రావు సంచలన నిర్ణయం
మంత్రి పదవి ఆశించి భంగపడ్డ మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు(MLA Prem Sagar Rao) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి పదవి ఆశించి భంగపడ్డ మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు(MLA Prem Sagar Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ప్రేమ్ సాగర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన చెందారు. కట్టె కాలే వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా.. పదవుల కోసం పార్టీలు మారే వ్యక్తిని కాదు అని సంచలన ప్రకటన చేశారు. ఏ పార్టీలో అయినా నిరాశ, అసంతృప్తులు కామన్ అని అన్నారు. నా నియోజకవర్గంలో ఎవరి ఆధిపత్యం చెల్లదు.. మంచిర్యాలను అభివృద్ధి చేసుకునే బాధ్యత నాది అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అయినా, పార్టీలో అయినా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఒక్కడే తనకు బాస్ అని ప్రకటించుకున్నారు. మిగిలిన వారితో తనకు పనిలేదని చెప్పారు. పదవులు వచ్చాయని ఇష్టానుసారం బిహేవ్ చేస్తే చూస్తూ ఊరుకోం అని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. నా కార్యకర్తలపై ఈగ వాలినా వదిలిపెట్టను అని కీలక వ్యాఖ్యలు చేశారు.
కాగా, కొత్త మంత్రుల పేర్లు అనౌన్స్ కాగానే.. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రంగంలోకి దిగారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్‌రావులను కన్విన్స్ చేశారు. రాబోయే రోజుల్లో అవకాశం దక్కుతుందని చెప్పడంతో అసంతృప్తి వీడారు.






