డ్రోన్ రివర్స్: కాంగ్రెస్ ఎమ్మెల్యేకు తప్పిన పెను ప్రమాదం

by Prasad Jukanti |   (  Updated:2026-04-19 12:25:35  IST  )

వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డికి ప్రమాదం తప్పింది.

డ్రోన్ రివర్స్: కాంగ్రెస్ ఎమ్మెల్యేకు తప్పిన పెను ప్రమాదం
X

దిశ, డైనమిక్ బ్యూరో/దిశ, కుల్కచర్ల: వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. డ్రోన్ ప్రారంభోత్సవంలో అపశృతి చోటు చేసుకోవడంతో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. ఆదివారం కుల్కచర్ల మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్రోన్ పిచికారీ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ క్రమంలో మందులు పిచికారి చేసే డ్రోన్ల పంపిణీని ప్రారంభించారు. ఆ సమయంలో డ్రోన్ గాలిలోకి ఎగిరినట్లే ఎగిరి తిరిగి అది నేరుగా ఎమ్మెల్యేపైకి దూసుకువచ్చింది. ఈ ఘటనలో డ్రోన్ రెక్కలు తగిలి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి గాయాలయ్యాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది రామ్మోహన్ రెడ్డిని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఎమ్మెల్యేకు వైద్యులు చికిత్స అందించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

Next Story