- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘కేటీఆర్ నెత్తిమీద చల్లుకున్న నీళ్లు అవే’.. మేడిపల్లి సత్యం కీలక వ్యాఖ్యలు
బీఆర్ఎస్(BRS) నేతలపై కాంగ్రెస్ నేత, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం(Medipally Sathyam) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) నేతలపై కాంగ్రెస్ నేత, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం(Medipally Sathyam) కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లోని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును వారే నిర్మించినట్లుగా హరీష్ రావు ఊదరగొడుతున్నారు.. అసలు ఎల్లంపల్లి(Yellampalli)కి బీఆర్ఎస్‌కు ఏం సంబంధం? అని ప్రశ్నించారు. ఎల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ మానస పుత్రిక అని చెప్పారు. శంకుస్థాపన చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే.. పూర్తి చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అని అన్నారు. ఎల్లంపల్లిని ప్రారంభిస్తే కాంగ్రెస్‌కు పేరు వస్తుందన్న భయంతో ఇప్పటివరకు అధికారికంగా ప్రారంభోత్సం లేకుండా చేశారని మండిపడ్డారు. ఎల్లంపల్లిని పూర్తిచేస్తే ఎందుకు కేసీఆర్(KCR) ప్రారంభించలేదు..? అని అడిగారు. కాళేశ్వరం ప్రారంభోత్సవానికి ఇద్దరు ముఖ్యమంత్రులను తీసుకొచ్చిన కేసీఆర్ ఎల్లింపల్లిని ఎందుకు ఓపెన్ చేయలేదు..? అని సీరియస్ అయ్యారు. ‘ఓపెన్ చేసి ఉంటే పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, భూపాలపల్లి, మంచిర్యాలకు ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు గా 2.24 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. సింగరేణి, సింగరేణి విద్యుత్ సంస్థలకు నీటి సరఫరా కూడా ఇక్కడి నుంచే జరుగుతోంది. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు కేటీఆర్ తన నెత్తిన చల్లుకున్న నీళ్లు ఇవే’ అని సత్యం గుర్తుచేశారు.
‘కాంగ్రెస్ పూర్తిచేసిన ప్రాజెక్టును బీఆర్ఎస్ వచ్చాక కాళేశ్వరంలో భాగం చేసుకున్నారు.. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా మారింది.. బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎల్లంపల్లితో ఎలాంటి సంబంధం లేదు.. ప్రాణహిత చేవేళ్లను రద్దు చేసి కేసీఆర్ కాళేశ్వరం తీసుకువచ్చాడు.. లక్షన్నర కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం నిర్మిస్తే బ్యారేజీలు పనికి రాకుండా పోయాయి’ అని సత్యం విమర్శలు చేశారు. ‘మా ముఖ్యమంత్రికి కామన్ సెన్స్ లేదని హరీష్ రావు(Harish Rao) అంటున్నారు.. మీకు సెన్స్ లేదు, సిన్సియారిటీ లేదనే తెలంగాణ ప్రజలు ఫామ్ హౌస్‌లో పడేశారు.. నువ్వు కాళేశ్వరరావు కాదు నువ్వు కరప్షన్ రావు, కలెక్షన్ రావు అని కవితనే సర్టిఫికెట్ ఇచ్చారు.. అయినా సిగ్గులేకుండా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు.. ముందు కవిత అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పు.. కవిత ఆరోపణలు తప్పు అయితే ఖండించు.. లేదా పరువునష్టం దావా వేయు. నిజమైతే బహిరంగ క్షమాపణ చెప్పు’ అని డిమాండ్ చేశారు.






