- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాడి కౌశిక్ రెడ్డి ప్రవర్తన నీచాతి నీచంగా ఉంది: మేడిపల్లి సత్యం సీరియస్
కరీంనగర్ వేదికగా జరిగిన హింసాత్మక ఘటనలు, బీఆర్ఎస్ నాయకుల భాషా తీరుపై చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

దిశ, వెబ్‌డెస్క్: కరీంనగర్ వేదికగా జరిగిన హింసాత్మక ఘటనలు, బీఆర్ఎస్ నాయకుల భాషా తీరుపై చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎల్పీ మీడియా సెంటర్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో హింసకు, కారుకూతలకు తావులేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డి ప్రవర్తన నీచాతి నీచంగా ఉందని, ఆయన నోటి దురుసు వల్లే కరీంనగర్ ఘటన జరిగిందని సత్యం మండిపడ్డారు. తక్షణమే ఆయన శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎథిక్స్ కమిటీ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసి, కౌషిక్ రెడ్డి లాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు.
కేటీఆర్, కేసీఆర్లకు హెచ్చరిక..
"పాడి కౌషిక్ రెడ్డి లాంటి వారిని ప్రోత్సహించవద్దని కేటీఆర్‌కు ఎన్నిసార్లు చెప్పినా మార్పు లేదు" అని సత్యం ఆవేదన వ్యక్తం చేశారు. "కేసీఆర్ గారు.. మీ కొడుకును, కౌషిక్ రెడ్డి లాంటి వారిని కంట్రోల్ చేయండి. లేదంటే బీఆర్ఎస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. భాష అదుపులో లేకపోతే తెలంగాణ ప్రజలు తిరగబడి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి" అని హెచ్చరించారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని మేడిపల్లి సత్యం విమర్శించారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్న వడ్లకు బోనస్, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్ వంటి పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని.. రేవంత్ రెడ్డి మరో పదేళ్లు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో డ్రగ్స్, పబ్ కల్చర్ తెచ్చారని, నేరెళ్లలో ఇసుక దందాను అడ్డుకున్న దళితులపై అమానుషంగా ప్రవర్తించారని గుర్తుచేశారు. హిట్లర్ పరిపాలనను తలపించేలా సాగిన నిర్బంధాలను ప్రజలు ఇంకా మర్చిపోలేదని ఎద్దేవా చేశారు.
కరీంనగర్ బంద్‌కు ఎవరూ సహకరించవద్దు..
కరీంనగర్ ఘటనలో తప్పు బీఆర్ఎస్ నాయకులదేనని, ఇప్పుడు మళ్ళీ బంద్‌కు పిలుపునివ్వడం హాస్యాస్పదమని ఆయన అన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించినందుకు బీఆర్ఎస్ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడుల పైన డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు కానీ ఆత్మాభిమానాన్ని వదులుకోరని, బీఆర్ఎస్, బీజేపీ నేతలు తమ హింసా రాజకీయాలను మానుకోవాలని మేడిపల్లి సత్యం హితవు పలికారు.






