- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేను మంత్రి పదవికి మోస్ట్ ఎలిజిబుల్..కాంగ్రెస్ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్
రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మంత్రి పదవికి మోస్ట్ ఎలిజిబుల్ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లోని బీసీ ఎమ్మెల్యేలకు అదనపు పదవులు ఉన్నాయని తనకు మాత్రం ఎలాంటి పదవులు లేవని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మంత్రి పదవికి మోస్ట్ ఎలిజిబుల్ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లోని బీసీ ఎమ్మెల్యేలకు అదనపు పదవులు ఉన్నాయని తనకు మాత్రం ఎలాంటి పదవులు లేవని అన్నారు. తన పార్లమెంట్ పరిధిలో అందరికీ పదవులు రావడమే తనకు మైనస్ అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే అదే పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యే వివేక్, శ్రీధర్ బాబులకు మంత్రి పదవులు దక్కాయి. ఇక గతంలో మంత్రివర్గ విస్తరణ సమయంలోనూ తాను కూడా అర్హుడినే అని మక్కన్ సింగ్ ఠాకూర్ అన్నారు. ఆయన మంత్రి పదవిని ఆశించారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ చాలా కాలంగా పెద్దపల్లి పార్లమెంట్‌లో పార్టీకి సేవచేయడంతో ఆయన మంత్రి పదవి ఆశించారు. కానీ ఆయనకు నిరాశే మిగిలింది. ఈ క్రమంలో మరోసారి మక్కన్ సింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.






