- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pawan Kalyan: పవన్ కల్యాణ్ తెలంగాణ పర్యటనపై కాంగ్రెస్ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్
పవన్ కల్యాణ్ పై అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇవాళ తెలంగాణలో పర్యటించిన సంగతి తెలిసిందే. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని (Kondagattu Anjaneya Swamy) దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ. 35.19 కోట్ల టీటీడీ భక్తుల వసతి కోసం 96 గదుల ధర్మశాల, దీక్ష విరమణ మండప నిర్మాణానికి భూమి పూజ చేశారు. అయితే ఈ పర్యటనపై కాగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి (MLA Anirudh Reddy) హాట్ కామెంట్స్ చేశారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజల మనసును పవన్ గుర్తించాలని, తెలంగాణ ప్రజలం ఎప్పుడూ ఒకరి మంచే కోరుతామన్నారు. నరదిష్టి అంటూ తెలంగాణపై పవన్ మాట్లాడినా ఇక్కడి ప్రజలు అత్యంత గౌరవం ఇచ్చారన్నారు. ఇవాళ చిట్ చాట్‍లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
కాగా తెలంగాణ నాయకుల దిష్టి తగలడం వల్లే గోదావరి జిల్లాల్లో కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యల నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎంను అనిరుద్ రెడ్డి వరుసగా టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే.పవన్ నరదిష్టి వ్యాఖ్యలపై గతంలో అనిరుధ్ రెడ్డి స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్‍లో సింగిల్‌గా పోయే దమ్ము లేకనే పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకున్నారని అసలు చిరంజీవి లేకపోతే నిన్ను ఎవ్వడు చూడరని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలంటే పవన్ కు ఎందుకంత చిన్న చూపు? చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్‌లోని ఆస్తులు అమ్మేయాలని అనిరుధ్.. పవన్ కల్యాణ్‌కు ఛాలెంజ్ చేశారు. ఏపీపై అంత ప్రేమ ఉంటే హైదరాబాద్‌లో ఎందుకుంటున్నావని నిలదీశారు. నరదిష్టి వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.






