సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే వదిన ఓటమి

by Gantepaka Srikanth |

సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే వదిన ఓటమి

సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే వదిన ఓటమి
X

దిశ, వెబ్‌డెస్క్: సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే మురళీ నాయక్‌కు చుక్కెదురైంది. మురళీ నాయక్ సొంత ఊరిలో ఓడిపోయిన ఆయన వదిన, కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా కౌసల్య ఓటమి చెందారు. మహబూబాబాద్ మండలం సోమ్లా తండాల్లో 27 ఓట్లతో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ఇస్లావత్ సుజాత అనే మహిళ విజయం సాధించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు తెలంగాణలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో 84.28 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. మొత్తం 45,15,141 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ఎంపీలకు వారి వారి స్వగ్రామాల్లో షాక్‌లు తగులుతున్నాయి. భద్రాద్రి ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు స్వగ్రామం చిన్నబండిరేవు సర్పంచ్ స్థానం బీఆర్ఎస్ కైవసం, షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ సొంత గ్రామం వీర్లపల్లిలో కాంగ్రెస్ బలపరచిన అభ్యర్థి ఓటమి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జి చిన్నారెడ్డి సొంత గ్రామం జయన్న తిరుమలాపురంలో బీఆర్ఎస్ విజయం సాధించారు.

Next Story