తీన్మార్ మల్లన్న మాటలు పరిధి దాటుతున్నాయి.. కాంగ్రెస్ MLA ఫైర్

by Gantepaka Srikanth |   (  Updated:2025-02-03 12:56:39  IST  )

కాంగ్రెస్(Telangana Congress) నేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్ కుమార్)పై ఆ పార్టీ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి(Kumbam Anil Kumar Reddy) ఫైర్ అయ్యారు.

తీన్మార్ మల్లన్న మాటలు పరిధి దాటుతున్నాయి.. కాంగ్రెస్ MLA ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్(Telangana Congress) నేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్ కుమార్)పై ఆ పార్టీ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి(Kumbam Anil Kumar Reddy) ఫైర్ అయ్యారు. సోమవారం కుంభం అనిల్ మీడియాతో మాట్లాడారు. చింతపండు నవీన్ కుమార్( Theenmar Mallanna) పరిధి దాటి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నల్లగొండలో స్వయంగా తాము డబ్బులు పెట్టి.. నవీన్‌ను ఎమ్మెల్సీగా గెలిపించుకున్నామని అన్నారు. కావాలనే ఓ వర్గాన్ని నవీన్ టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని సీరియస్ అయ్యారు. వదిలే ప్రసక్తే లేదని.. నవీన్‌పై తప్పకుండా పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటుందని అన్నారు.


కాగా, హన్మకొండ(Hanmakonda) వేదికగా నిర్వహించిన ‘బీసీ రాజకీయ యుద్ధభేరి’ సభలో తీన్మార్ మల్లన్న పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి కావటం ఖాయమని హాట్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డే(Revanth Reddy) చివరి ఓసీ సీఎం అని వ్యాఖ్యానించారు. తెలంగాణకు బీసీలే ఓనర్లు అని.. బీసీల ఆర్థికంగా వెనకబడ్డారని అంటున్నారని అదేదీ నిజం కాదన్నారు. అవసరమైతే బీఆర్ఎస్(BRS) పార్టీని కొనేంత డబ్బు బీసీల దగ్గర ఉందని అన్నారు. బీసీలకు బీ ఫారం ఇవ్వని వారితో బీసీలకు ఇక యుద్ధమేనని కీలక ప్రకటన చేశారు.

అంతేకాదు.. ఒక సామాజికవర్గాన్ని ఉద్దేశించి మల్లన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీసీ వర్గాలు ప్రతి ఏడాదికి రూ.1.20 లక్షల కోట్లు రాష్ట్ర ఖజానాకు జమ చేస్తుంటే.. ప్రభుత్వం మాత్రం కేవలం రూ.9వేల కోట్లే కేటాయిస్తుందని ఫైరయ్యారు. రాబోయే అన్ని ఎన్నికల్లో బీసీలు పోటీ చేసి ఐక్యంగా ముందుకెళ్లాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. అన్ని పార్టీల నేతలు మల్లన్న వ్యాఖ్యలపై స్పందిస్తున్నారు. కొందరు మల్లన్నకు సపోర్ట్‌ చేస్తుండగా.. మరికొందరు విమర్శిస్తున్నారు. తాజాగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి స్పందించి మండిపడ్డారు.

Next Story