చిక్కుల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే సామేల్.. లిక్కర్ వ్యాపారుల నుంచి మామూళ్లు వసూలు!

by Gantepaka Srikanth |   (  Updated:2025-06-10 03:34:41  IST  )

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్(Mandula Samuel) వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

చిక్కుల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే సామేల్.. లిక్కర్ వ్యాపారుల నుంచి మామూళ్లు వసూలు!
X

దిశ, వెబ్‌డెస్క్: తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్(Mandula Samuel) వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. లిక్కర్ సిండికేట్ నిర్వాహకుల నుంచి ఎమ్మెల్యే మామూళ్లు వసూళ్లు చేస్తోన్న వీడియో ఒకటి సోషల్ మీడియాను కుదిపేస్తోంది. అయితే వీడియోలో ఎమ్మెల్యే ఫేస్ కనిపించకుండా వీడియో తీశారు. వైన్స్ యజమానుల నుంచి ఎమ్మెల్యే డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు వీడియో ద్వారా తెలుస్తోంది. ‘ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టా రికవరీ కావాలి. మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదు. ప్రతీ రోజు నాకు రూ.లక్ష వరకు ఖర్చు అవుతోంది. ప్రభుత్వం ఇచ్చే జీతం సరిపోవడం లేదు. ఒక్కో రోజు కారులో డీజిల్ పోసుకోవడానికి కూడా డబ్బులు ఉండట్లేదు. ఇప్పుడు మీరు ఇచ్చే మాములు కూడా నాకు టీ ఖర్చులకు కూడా సరిపోవు. అయినా మీరంతా నాకు కావాల్సిన వాళ్లు కాబట్టి మీ పని పూర్తి చేస్తా. మాట వినని వారిని, మీకు సహకరించని వారి సంగతి చూస్తా’ అంటూ సామేల్ మాట్లాడారు. అయితే వైన్ షాపు యాజమానుల ఇల్లీగల్ దందాను స్థానిక పోలీసులు అడ్డుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే వారంతా ఎమ్మెల్యేను కలిసి ASPతో మాట్లాడి సమస్యలు రాకుండా చూడాలని రిక్వెస్ట్ చేశారు. ఇక మీరు వెళ్లండి నేను చూసుకుంటాను అని వారికి ఎమ్మెల్యే హామీ ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ వీడియో స్థానికంగా కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే మామూళ్ల వ్యవహారం బయటపెట్టాలనే ఉద్దేశ్యంతోనే సీక్రెట్ కెమెరాతో సిండికేట్ మాఫియా ఆపరేషన్ చేసిందని మరోవైపు ప్రచారం జరుగుతోంది.

Next Story