రివర్స్ గేర్.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీఆర్ పాట.. స్మితా సబర్వాల్‌కూ సపోర్ట్

by Bhoopathi Nagaiah |

కేసీఆర్ అధ్యక్షతన ఈనెల 27న నిర్వహిస్తున్న వరంగల్ సభ సక్సెస్ అవుతుందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

రివర్స్ గేర్.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీఆర్ పాట.. స్మితా సబర్వాల్‌కూ సపోర్ట్
X

కేసీఆర్ అధ్యక్షతన ఈనెల 27న నిర్వహిస్తున్న వరంగల్ సభ సక్సెస్ అవుతుందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను చూసేందుకు ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారని, సభకు భారీగా జనం వచ్చే అవకాశం ఉందన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ చేసిన రీట్వీట్‌లో తప్పేం లేదన్నారు. అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితినే ఆమె రీట్వీట్ చేశారని వ్యాఖ్యానించారు. అసలు దానం నాగేందర్ ఎందుకు ఆ కామెంట్స్ చేశారో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

పహెల్గాం ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్తాన్ పట్ల భారత ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోగా పాకిస్తాన్ ప్రభుత్వం ప్రతీకార చర్యలకు దిగింది. భారత్‌తో వాణిజ్య కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు పాక్ ప్రకటించింది. అలాగే భారత్ విమానాలకు తన గగనతలాన్ని తక్షణం మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే భారతీయులకు సార్క్ విసాలు రద్దు చేసింది. వాఘా సరిహద్దును మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇస్లామాబాద్ లోని భారత దౌత్యవేత్తల సంఖ్యను 30కి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్‌ను అన్ని విధాలుగా రౌండప్ చేయాలని భారత ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న తరుణంలో పాకిస్తాన్ వేస్తున్న ఎత్తుగడలు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. ఈ పరిణామాలతో భారత్ - పాక్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. బార్డర్‌లో యుద్ధ వాతావరణం నెలకొంటోంది. దీనిపై పూర్తి సమాచారం ఈ లింక్‌లో చూడండి.

సారీ నాన్న.. నాకు బతకాలని లేదు.. నా కొడుకు జాగ్రత్త..’ అంటూ ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అద్దంపై రాసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లాకేంద్రం పోచమ్మ వాడకు టెకీ ప్రసన్న లక్ష్మి తన కొడుకును అత్తమామలకు ఇవ్వకుండా మీరే జాగ్రత్తగా చూసుకోండి నాన్న.. అంటూ రాసి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆంధ్రా వ్యక్తిని పెళ్లి చేసుకున్న ప్రసన్న లక్ష్మి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలుసుకోవాలంటే ఈ లింక్‌ను ఓపెన్ చేయాల్సిందే..

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను వైసీపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓ వీడియోను విడుదల చేసిన దువ్వాడ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఈ సస్పెన్షన్ తాత్కాలిక విరామం మాత్రమేనని, త్వరలోనే మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో తిరిగి వస్తానన్నారు. ఇంకా ఆ వీడియోలో దువ్వాడ ఏమన్నారో ఈ లింకు ఓపెన్ చేస్తే పూర్తిగా చూడవచ్చు.

Next Story