చూడకుండా కేటీఆర్ జాతీయ గీతం పాడగలడా?.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సవాల్

by Gantepaka Srikanth |

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్ష్యంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

చూడకుండా కేటీఆర్ జాతీయ గీతం పాడగలడా?.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్ష్యంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీ వేదికగా కేటీఆర్ అబద్ధాలు ఆడుతూ, అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేటీఆర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్ నిన్న అసెంబ్లీలో ఒక పెయిడ్ ఆర్టిస్ట్‌లా మాట్లాడారని నాయిని విమర్శించారు. "యూట్యూబ్ ఛానెళ్లు పెట్టుకుని, ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదువుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. కనీసం జాతీయ గీతం కూడా చూడకుండా పాడలేని వ్యక్తి కేటీఆర్" అని ఎద్దేవా చేశారు. వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

డ్రగ్ టెస్ట్ చేస్తే వాస్తవాలు తెలుస్తాయి..

బీఆర్ఎస్ నేతల ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేస్తూ, వారికి డ్రగ్ టెస్టింగ్ చేయించాలని నాయిని కోరారు. అప్పుడే అసలు వాస్తవాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు. కేటీఆర్ లాంటి వ్యక్తులు సమాజానికి 'క్యాన్సర్' లాంటి వారని, వారిని అడ్డుకోకపోతే రాష్ట్రానికి ప్రమాదమని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి దయ వల్లే మీరు ఇంకా బయట తిరుగుతున్నారని గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ హయాంలో వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీగా భూకబ్జాలు జరిగాయని నాయిని ఆరోపించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు కడదామంటే కనీసం స్థలం లేకుండా చేశారని మండిపడ్డారు. కార్పొరేటర్లను మర్డర్ చేయించిన చరిత్ర మీది.. అటువంటి మీరు గూండాయిజం గురించి మాట్లాడటం హాస్యాస్పదమని దుయ్యబట్టారు.

Next Story